రజనీకాంత్‌ కెలుక్కున్నాడెందుకు.?

ఇప్పుడంటే, రజనీకాంత్‌కి 'అమ్మ' జయలలిత అంటే వల్లమాలిన అభిమానం ఏర్పడిందిగానీ.. ఒకప్పుడు, ఆమె విషయంలో రజనీకాంత్‌కి వేరే భావాలుండేవి. 'జయలలిత గనుక ముఖ్యమంత్రి అయితే తమిళనాడుని దేవుడు కూడా కాపాడలేడు..' అంటూ గతంలో రజనీకాంత్‌…

ఇప్పుడంటే, రజనీకాంత్‌కి 'అమ్మ' జయలలిత అంటే వల్లమాలిన అభిమానం ఏర్పడిందిగానీ.. ఒకప్పుడు, ఆమె విషయంలో రజనీకాంత్‌కి వేరే భావాలుండేవి. 'జయలలిత గనుక ముఖ్యమంత్రి అయితే తమిళనాడుని దేవుడు కూడా కాపాడలేడు..' అంటూ గతంలో రజనీకాంత్‌ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలతో అప్పట్లో జయలలిత తీవ్రంగా కలత చెందారు కూడా. కానీ, ఆ తర్వాత జయలలిత, రజనీకాంత్‌తో సత్సంబంధాల్నే కొనసాగించారు. కాదు కాదు, రజనీకాంత్‌ – జయలలితతో సత్సంబంధాల్ని కొనసాగించారు. 

పాత విషయాల్ని రజనీకాంత్‌ తాజాగా గుర్తు చేసుకున్నారు. 'ఆమెది చాలా మంచి విషయం. అప్పట్లో ఆమె ఓటమికి నేనే కారణం. నా వ్యాఖ్యల వల్లే జయలలిత ఓడిపోయారు. అయినాసరే, ఆమె నా ఆహ్వానాన్ని మన్నించి, నా కుమార్తె పెళ్ళికి వచ్చారు. పైగా, పాత విషయాల్ని మర్చిపోమన్నారు. నేనంటే ఆమెకు చాలా అభిమానం..' అంటూ నడిగర్‌ సంఘం ఏర్పాటు చేసిన జయలలిత సంతాప సభలో పాత విషయాల్ని గుర్తు చేసుకున్నారు రజనీకాంత్‌. 

అవసరమా ఇదంతా.? అంటూ, రజనీకాంత్‌ అభిమానులే గుస్సా అవుతున్నారిప్పుడు. రజనీకాంత్‌కి ఛాదస్తం పెరిగిపోయిందని ఆయన అభిమానుల్లోనే కొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. గతం గతః అని వదిలేస్తే ఎలా.? ఆనాటి ఘటనకు రజనీకాంత్‌ ఇప్పుడు విచారం వ్యక్తం చేయడం సబబేనని ఇంకొందరు సమర్థిస్తున్నారు. అన్నట్టు, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఆకాంక్షిస్తున్న ఆయన అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలతో ఒకింత ఇబ్బంది పడుతున్నారట.