హీరో రాజశేఖర్ అతి వేగంతో కారు నడుపుతారని, అదే నిన్న రాత్రి జరిగిన ప్రమాదానికి కారణం అని వార్తలు ఇప్పటికే వచ్చేసాయి. అయితే నిన్న ప్రమాదానికి గురయిన కారు మీద మూడు చలాన్లు వున్నట్లు సోషల్ మీడియాలో పిక్చర్లు కూడా వచ్చాయి.
ఇదిలా వుంటే హీరో రాజశేఖర్ కు మరో కారు కూడా వుందని తెలుస్తోంది. అది రాయలసీమకు చెందిన ఓ ప్రముఖ రాజకీయనాయకుడు, ఎక్స్ ఎంపీ నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన కారు అని తెలుస్తోంది. ఈ కారు మీద ఏకంగా పాతికవేల వరకు చలాన్లు కట్టకుండా పెండింగ్ లో వున్నాయని తెలుస్తోంది.
రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి అర్థరాత్రి దాటాక రావడం అన్నది రాజశేఖర్ కు తరచు వుండే అలవాటు అని, అలా వెళ్లి వచ్చినపుడల్లా స్పీడ్ లిమిట్ దాటటం వల్ల చలాన్లు పడుతూ వుంటాయని బోగట్టా. వాస్తవానికి కారు నడిపినపుడు రాజశేఖర్ కావాలని మితిమీరిన వేగంతో నడపరు అని, కానీ ఆయన అనుకోకుండానే స్పీడ్ గా నడిపేస్తుంటారని, ఆయనతో పరిచయం వున్న వర్గాల బోగట్టా.
అందువల్ల తరచు చలాన్లు పడుతుంటాయని, అవే పెండింగ్ లో వున్నాయని రాజశేఖర్ తో పరిచయాలు వున్నవారు చెప్పిన సమాచారం.