దెయ్యం సినిమాల రోజులు ఇవి. దెయ్యం పాయింట్ వుంటే సినిమాకు ప్లస్ అయినట్లే. అందుకే కావచ్చు, రాజ్ తరుణ్ అంథగాడులో కూడా దెయ్యం పాయింట్ వుందట. సినిమాలో ఆది నుంచి అంతం వరకు రాజేంద్రప్రసాద్ ను దెయ్యంగానే పరిగణిస్తుంటారట.
రాజ్ తరుణ్ తను చేసే కీలక కార్యక్రమానికి ఓ దెయ్యాన్ని సృష్టించి, కథ నడిపిస్తాడట. అంతే కానీ నిజానికి ఆపాత్ర వుండదట. అదే రాజేంద్రడు నటించిన పాత్ర.
మొత్తం మీద ఇదేదో కాస్త డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నట్లు వుంది. కన్ఫ్యూజ్ లేకుండా, వుంటే క్లిక్ అయిపోతుంది. కానీ దెయ్యం అనీ, కాదు అనీ, అసలు ఆ పాత్రే లేదనీ, ఇలా మరీ మేదావితనం ప్రయోగాలు అయితే మాత్రం జనం ఇబ్బంది పడతారు. విడుదలకు ఇక ఒక రోజే వుంది. చూడాలి ఎలా వుంటుందో ?