ఒకప్పటి కామెడీ హీరో, ఆ తరువాత క్యారెక్టర్ ఏక్టర్, ఆ పై మా అధ్యక్షుడిగా రకరకాలుగా వార్తల్లో వుంటూ వచ్చారు నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్. అలాంటిది ఒక్కసారిగా ఆయన పేరు ఇండస్ట్రీలో వినిపించడం మానేసింది. మా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక సమయంలో నెలకొన్న హడావుడి ఇంతా అంతా కాదు. పెద్ద పెద్ద వాళ్లను కలవడం ఒక ఎత్తు. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఏక్టర్ గా కనిపించడం మరో ఎత్తు.
అయితే మా అధ్యక్షుడిగా పదవీ కాలం ముగిసింది. కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఆ తరవాత రాజేంద్ర ప్రసాద్ మాటే వినిపించడం మానేసింది. పైగా పెద్దగా సినిమాల్లో కూడా కనిపించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికి రెండు మూడు సినిమాల్లో మాత్రమే కనిపించారు. లేటెస్ట్ గా మా అసోసియేషన్ పాతికేళ్ల సంబరాలు అంటూ హడావుడి స్టార్ట్ అయింది.
రాజేంద్ర ప్రసాద్ వ్యతిరేకించిన ఒకప్పటి హీరో మురళీ మోహన్ ను ముందుకు తెచ్చారు. మురళీ మోహన్ ప్యానల్ గా ముద్రపడిన ప్యానెల్ ను వ్యతిరేకించి గెలిచారు రాజేంద్ర ప్రసాద్. కానీ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాజేంద్ర ప్రసాద్ రాలేదు కానీ మురళీ మోహన్ వచ్చారు.
సినిమాల్లోనూ పెద్దగా కనిపించక, మా వ్యవహారాల్లోంచీ మాయమై, రాజేంధ్ర ప్రసాద్ ఏం చేస్తున్నట్లో మరి?