లేడీస్ టైలర్ అనగానే గుర్తుకు వచ్చేది దర్శకుడు వంశీ..హీరో రాజేంద్ర ప్రసాద్. ఈ సినిమా సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్. ఎన్నాళ్లో, ఎన్ని చేతులో మారి ఆఖరికి ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. సుమంత్ అశ్విన్ హీరో. ఈ సినిమా ఇటీవలే దర్శకుడు వంశీ కి ఇష్టమైన పాపికొండలు ప్రాంతంలో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
అయితే సీక్వెల్ కాబట్టి, లేడీస్ టైలర్ కొడుకు ప్యాషన్ డిజైనర్ గా కనిపిస్తాడు కాబట్టి, ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర కూడా వుంటుందని అనుకున్నారు. వాస్తవానికి ఆరంభంలో దర్శకుడు వంశీ కూడా స్క్రిప్ట్ ను ఆ దిశగానే ఆలోచించినట్లు తెలుస్తోంది.
కానీ మధ్యలో ఏమయిందో మరి, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటించడం లేదు. అంటే జమజచ్చ అంటూ కలవరించే రాజేంద్రప్రసాద్ పాత్ర అందులో కనిపించదన్నమాట. జస్ట్ పాత సీన్లు ఏవన్నా వేసి, వాయిస్ ఓవర్ తో పని కానిచ్చేస్తారేమో? తెలియాల్సి వుంది.
లేడీస్ టైలర్ పాత్రను ఇందులోకి తీసుకువస్తే, గెస్ట్ గా తీసుకురావాలా? లెంగ్త్ పెంచాలా? లెంగ్త్ పెంచితే బడ్జెట్ సమస్యలు ఇలా చాలా మీమాంసల కారణంగా, రాజేంద్రుడు లేకుండానే ఫ్యాషన్ డిజైనర్ తయారీ షురూ అయినట్లు తెలుస్తోంది. కానీ రాజేంద్రుడు వుంటే, మళ్లీ మరోసారి వంశీ-రాజేంద్రుడి కాంబినేషన్ అంటే వచ్చే బజ్ వేరు