సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘శివాజీ’, ‘రోబో’లాంటి ఘన విజయాలతో తెలుగునాట కూడా తనకి ఎంత మార్కెట్ ఉందనేది చూపించారు. అయితే ఆ విజయాల తాలూకు క్రెడిట్ మొత్తం రజనీకే ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒకవేళ దీంతో అంగీకరించని వారుంటే వారికి ‘లింగ’ చిత్రానికి జరుగుతోన్న బిజినెస్ సమాధానమిస్తుంది. ఆ చిత్రాలకి శంకర్ ఫ్యాక్టర్ కూడా పెద్ద రోల్ ప్లే చేసింది.
‘లింగ’ సినిమాకి శంకర్ లేకపోవడంతో ఈ చిత్రానికి డిమాండ్ చేస్తోన్న హై రేట్లకి కొనేందుకు ఎవరూ ముందుకి రావట్లేదు. ‘రోబో’తో నలభై కోట్ల బిజినెస్‌ని నాలుగేళ్ల క్రితమే చేసిన రజనీకాంత్‌పై మళ్లీ అదే మొత్తం ఇన్వెస్ట్ చేసే ధైర్యం బయ్యర్లు చేయడం లేదు. ఆఫ్ సీజన్లో వస్తున్న ‘లింగ’ చిత్రం మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్నా కానీ ఇంకా బిజినెస్ క్లోజ్ అవలేదు.
ఈ చిత్రం రజనీకాంత్‌కి తెలుగునాట ఉన్న స్టామినా ఏంటనేది ప్రూవ్ చేయనుంది. శంకర్ బ్రాండ్ లేకుండా ఆయన ఎంత బిజినెస్ చేయగలరనేది దీంతో తేలిపోతుంది. తమిళనాడు వరకు రజనీకి తిరుగు లేకపోయినా కానీ తెలుగులో ఆయన రేంజ్ ఏంటనే దానికి లింగ కొలమానంగా నిలుస్తుంది.