రకుల్‌ మీద డిపెండ్‌ అయిపోయాడు

సాయికుమార్‌ తనయుడు ఆది ‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’ చిత్రాలతో తన కెరీర్‌ని పాజిటివ్‌ నోట్‌లోనే స్టార్ట్‌ చేసాడు. అయితే ఆ తర్వాత మరో మెట్టు ఎక్కడం పోయి స్లిప్‌ అయిపోయాడు. సుకుమారుడు, ప్యార్‌ మే పడిపోయానే…

సాయికుమార్‌ తనయుడు ఆది ‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’ చిత్రాలతో తన కెరీర్‌ని పాజిటివ్‌ నోట్‌లోనే స్టార్ట్‌ చేసాడు. అయితే ఆ తర్వాత మరో మెట్టు ఎక్కడం పోయి స్లిప్‌ అయిపోయాడు. సుకుమారుడు, ప్యార్‌ మే పడిపోయానే ఫ్లాప్స్‌ అతడి చిత్రాలపై ఆసక్తి తగ్గించేసాయి. ఈ నేపథ్యంలో చాలా కాలంగా లేట్‌ అవుతూ వస్తోన్న రఫ్‌ రిలీజ్‌కి రెడీ అయింది. 

ఈ చిత్రంలో ఆది సిక్స్‌ ప్యాక్‌ బాడీతో యాక్షన్‌ హీరోగా కనిపించబోతున్నాడు. తనకి ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో పెద్ద బ్రేక్‌ వస్తుందని ఆది ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. మరి రెండు భారీ ఫ్లాపుల తర్వాత ఈ చిత్రాన్ని ఎవరైనా పట్టించుకుంటారంటారా? తన మీద తనకి నమ్మకం ఉన్నా లేకున్నా ఇందులో హీరోయిన్‌గా నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌పై మాత్రం ఆది చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. 

ఆమెకి ఇప్పుడు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ చూసి ఆది షాక్‌ అవుతున్నాడు. ఆది లక్‌ కొద్దీ రకుల్‌ సక్సెస్‌ కాకముందే ఈ చిత్రం సైన్‌ చేసింది. ఆమెకి క్రేజ్‌ పెరిగిన తర్వాత ఈ చిత్రం రిలీజ్‌ అవుతోంది. రకుల్‌ ఉంది కాబట్టి రఫ్‌ చిత్రానికి డెఫినెట్‌గా మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని ఆది ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. 

ఫ్లాప్స్‌లో ఉన్న సందీప్‌ కిషన్‌, గోపీచంద్‌తో హిట్స్‌ కొట్టింది కాబట్టి తనతోను అదే రిపీట్‌ అవుతుందని అనుకుంటున్నాడు. అయితే రకుల్‌ ఉన్నా కానీ ‘కరెంట్‌ తీగ’కి పవర్‌ కట్‌ అయి ఫ్లాప్‌ అయిందనేది ఆదికి తెలుసో లేదో?