రామ్ చరణ్… అఖిల్… డ్యాన్స్?

ఐఫా ఉత్సవం హడావుడి పెరిగింది. దీన్ని గ్రాండ్ గా చేయడానికి ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఈ ఐఫా కార్యక్రమంలో అల్లు శిరీష్ హోస్ట్ గా పాల్గొంటున్నాడు. సౌత్ ఇండియన్ టాప్ స్టార్స్ అంతా ఈ…

ఐఫా ఉత్సవం హడావుడి పెరిగింది. దీన్ని గ్రాండ్ గా చేయడానికి ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఈ ఐఫా కార్యక్రమంలో అల్లు శిరీష్ హోస్ట్ గా పాల్గొంటున్నాడు. సౌత్ ఇండియన్ టాప్ స్టార్స్ అంతా ఈ పాల్గొనడం, కొందరు కొన్ని ఈవెంట్ లు చేయడం వంటి అట్రాక్షన్లు వున్నాయి.

ఇదిలా వుంటే ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, అఖిల్ స్టేజ్ ఫెర్ ఫార్మన్స్ లు వుంటాయని తెలుస్తోంది. ఇందకోసం వాళ్లు ఇద్దరు ముమ్మరంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు వినికిడి. సాధారణంగా ఈ రేంజ్ స్టార్లు లైవ్ స్టేజ్ షో చేయడం అన్నది చాలా రేర్.

వాళ్ల వాళ్ల స్వంత సినిమాల ఈవెంట్ లలో కూడా కాలు కదపడం తక్కువ. కానీ ఐఫాను కాస్త ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తుండడంతో  చరణ్, అఖిల్ డ్యాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నిజమెంతొ కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది.