ధని ఒరువన్ రీమేక్ ను నిర్మాత డివివి దానయ్యే చేయాల్సి వుంది. దాని హక్కులు ఆయనే తీసుకున్నారు. కానీ బ్రూస్ లీ పరాజయం తరువాత రామ్ చరణ్ కు ఓ మాంచి హిట్ ఇచ్చే బాధ్యతను తనపై వేసుకున్నారు మేనమామ అల్లు అరవింద్. సో..ఆ విధంగా ఆ సినిమా గీతా బ్యానర్ లోకి వెళ్లింది. దానికి బదులుగా మరో సినమా దానయ్యకు చేస్తానని మాట ఇచ్చాడు రామ్ చరణ్.
దీనికి తోడు బ్లాక్ బస్టర్ డైరక్టర్ కొరటాల శివ దగ్గర రెండు అడ్వాన్స్ లు వున్నాయి. ఒకటి బండ్ల గణేష్ ది.. రెండవది డివివి దానయ్యది. బండ్ల గతంలో సినిమా చేయబొయి ఆగిపోయాడు. అందువల్ల శివను ఇప్పుడే తనకు చేయాలని ప్రెజర్ చేసే స్థితిలో లేడు. కానీ దానయ్య సంగతి అలా కాదు. చేసి తీరాలి లేదా. వడ్డీతో సహా అడ్వాన్స్ వెనక్కు ఇవ్వాలి.
సో.. రామ్ చరణ్-కొరటాల శివ-దానయ్య సినిమా ఆ విధంగా ఫిక్స్ అయింది. ఇదిలా వుంటే.. ఇప్పుడు రామ్ చరణ్ తో కాకుండా అఖిల్ తో చేస్తాడన్న ఫీలర్ బయటకు వచ్చింది. అఖిల్ తో వంశీ పైడిపల్లి అయిపోయింది.. హను రాఘవపూడి లైన్లో వున్నాడు. ఇప్పుడు కొరటాల శివ. మరి ఇదే నిజమైతే, కొరటాల శివ-రామ్ చరణ్ కాంబినేషన్ లేనట్లేనా?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు