రామ్ చరణ్ 15.. సుక్కూ 8

సినిమా కలెక్షన్లు పెరిగాయి. టికెట్ రేటును యూనిఫారమ్ రేటుగా చేసేసి, చిత్తానికి వసూళ్లు సాగిస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు. దేని లూప్ హోల్స్ దానికి వున్నాయి. పెద్ద సినిమా వస్తే చాలు టికెట్ ల…

సినిమా కలెక్షన్లు పెరిగాయి. టికెట్ రేటును యూనిఫారమ్ రేటుగా చేసేసి, చిత్తానికి వసూళ్లు సాగిస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు. దేని లూప్ హోల్స్ దానికి వున్నాయి. పెద్ద సినిమా వస్తే చాలు టికెట్ ల రేట్లు కట్టలు తెంచుకుంటాయి. దీంతో కలెక్షన్లు సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా యాభై కోట్లు దాటేస్తాయి.

కానీ దీని వలన ఎవరికి ప్రయోజనం. నిర్మాతకు ఏమైనా ఆనందం మిగులుతోందా? ఇంతకు ముందు టాప్ హీరోల సినిమాలు నలభై కోట్లలో పూర్తయ్యేవి. వసూళ్లు యాభైల్లో వుండేవి. ఇప్పుడు వసూళ్లు 70,  80కి చేరుతుంటే, ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే వుంటోంది. వసూళ్లు పెరిగిన రికార్డులు హీరోలకు, డైరక్టర్లే. వసూళ్లు పెరగడం వల్ల వచ్చిన లాభాలు హీరోలకే, డైరక్టర్లకే. నిర్మాతకు ఎప్పటిలాగే అదే టెన్షన్. అదే నష్టం లేదా అదే అరకొర లాభం.

ఇక అసలు సంగతేమిటంటే, మహేష్-మురగదాస్ సినిమాకు వంద కోట్లకు పైగా ఖర్చు అన్నది టాక్. ఆ సంగతి తెలిసిందే. ఎందుకంటే మహేష్, మురగదాస్ నే చెరో 20కోట్లు లాగేస్తారు కాబట్టి. ఇప్పుడు రామ్ చరణ్-సుక్కూ సినిమాకు కూడా ఖర్చు 70 కోట్లకు డేకేస్తోందట. దీనికి కారణం కేవలం కాస్టింగ్ నే 30కోట్ల వరకు లాగేయడం వల్ల. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 15కోట్ల దాకా తీసుకుంటున్నట్లు వినికిడి. సుకుమార్ 8 కోట్లు తీసుకుంటున్నారట. ఇక రావురమేష్, జగపతి బాబు, థర్టీ ఇయర్స్ పృధ్వీలాంటి పాడింగ్ ఆర్టిస్టులు వున్నారు. వీళ్లు కూడా వాళ్ల రేంజ్ లో బాగానే వసూలు చేస్తున్నారు.

రావు రమేష్ డైలీ లెక్కడ రెండున్నర లక్షలు, ప్లస్ సర్వీస్ టాక్స్ తీసుకంటున్నారట. జగపతిబాబు దానికి ఓ మెట్టు పైనే వున్నారట. ఇక పృధ్వీ కూడా తక్కువ తినలేదు. లక్షన్నరకు పైగానే తీసుకుంటున్నారు. దీనికి తోడు టెక్నికల్ కూడా కాస్ట్లీనే. దేవీశ్రీ ప్రసాద్ మూడుకు పైగా, రత్నవేలు, ఇంకా ఇతరులు కలిపి మొత్తం రెమ్యూనిరేషన్లే 35 దాటేస్తున్నాయట. మరి ఇక ప్రొడక్షన్, పబ్లిసిటీ..అంతా కలిపి 65కు పైనే అని తెలుస్తోంది. ఖర్చయిన రేటుకే అమ్మేస్తారు అనుకున్నా, వసూళ్లు 80 కోట్లు దాటాలి. అప్పుడే బయ్యర్లు హ్యాపీ.