రామ్ చరణ్ టైటిల్ పై ఇంట్రెస్టింగ్ చర్చ

ఏ ముహూర్తాన ఆ టైటిల్ పెట్టారో కానీ అప్పట్నుంచి రంగస్థలంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. దానికి తోడు ఈమధ్య రంగస్థలం బోర్డుతో ఉన్న ఓ ఫొటోను అనసూయ ట్వీట్ చేయడంతో చర్చ…

ఏ ముహూర్తాన ఆ టైటిల్ పెట్టారో కానీ అప్పట్నుంచి రంగస్థలంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. దానికి తోడు ఈమధ్య రంగస్థలం బోర్డుతో ఉన్న ఓ ఫొటోను అనసూయ ట్వీట్ చేయడంతో చర్చ మరింత రసకందాయంలో పడింది. రంగస్థలం అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థంకాక తలా ఒక రీజన్ చెబుతున్నారు.

సినిమా కథకు తగ్గట్టు రంగస్థలం అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది కాబట్టి ఆ పేరు పెట్టారంటూ మొన్నటివరకు రూమర్లు నడిచాయి. ఇందులో కొంత వాస్తవం ఉన్న మాట నిజమే. కాకపోతే కథకు రంగస్థలానికి లింక్ ఏంటనే విషయంపైనే చర్చ సాగుతోంది. కొంతమంది రంగస్థలం అనేది ఊరు పేరు అంటున్నారు.

మరికొంతమంది మాత్రం రామ్ చరణ్ ఇందులో నాటకాలు వేసే వ్యక్తిగా కనిపిస్తాడని, ఓ డ్రామా కంపెనీ ఏర్పాటుచేసి దానికి రంగంస్థలం అనే పేరు పెట్టాడని అంటున్నారు.

రూమర్ ఏదైనా సినిమాలో రంగస్థలం అనే బోర్డు మాత్రం చాలా చోట్ల కనిపించనుంది. 1985 నాటి పరిస్థితులకు ఫిక్షన్ జోడించి రాసుకున్న ఈ కథలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తారు.