సరైన బ్రేక్ లేక కిందా మీదా అవుతోంది రెజీనా. అలాంటి రెజీనాను రాబోయే ఓ సిన్మాలో స్టన్నింగ్స్ లుక్స్ తో చూడవచ్చంట. ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని ప్రోత్సహించడానికి హీరో నాని నిర్మిస్తున్న సినిమా 'అ!'. ఈ సినిమాలో హీరో వుండడు.
నాని. రవితేజల వాయిస్ ఓవర్ మాత్రమే. కాజల్ మెయిన్ లీడ్ లో వుంటుంది. ఆ తరువాత రెజీనా. ఈ సినిమాలో రెజీనా భలే డిఫరెంట్ గా కనిపిస్తుందట. శరీరం మీద టట్టూలతో కాస్త క్రేజీగా వుంటుందని తెలుస్తోంది. మన రెజీనానేనా ఈ అమ్మడు అంటారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే ఈ సినిమా మొత్తం డిఫరెంట్ గా వుంటుందట. పాత్రలన్నింటికీ చిన్న చిన్న స్టోరీలు, వీటిని కలుపుతూ స్క్రీన్ ప్లే రన్ అవుతుందట. అన్నీ కలిసి క్లయిమాక్స్ కు ఓ రూపం సంతరించుకుంటాయని తెలుస్తోంది. ఏడ్ ఫిల్మ్ లు, షార్ట్ ఫిల్మ్ ల బ్యాక్ గ్రవుండ్ నుంచి వచ్చిన ప్రశాంత్ వర్మ తెలుగు ప్రేక్షకులకు ఓ పూర్తి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడట.