రంగస్థలం: గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడో!

రంగస్థలం సినిమాకు సంబంధించి అంతా అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. కానీ మరోవైపు ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా సాగుతూనే ఉంది. ప్యాచ్ వర్క్ పేరుచెప్పి ఏకంగా రామ్ చరణ్ తోనే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.…

రంగస్థలం సినిమాకు సంబంధించి అంతా అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. కానీ మరోవైపు ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా సాగుతూనే ఉంది. ప్యాచ్ వర్క్ పేరుచెప్పి ఏకంగా రామ్ చరణ్ తోనే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

నిన్నటికి నిన్న సారథి స్టుడియోస్ లో చెర్రీపై కొన్ని సన్నివేశాలు తీశారు. అది కూడా ఓ సాంగ్ కు సంబంధించి డాన్స్ మూమెంట్. ఆ వెంటనే మధ్యాహ్నానికి యూనిట్ బూత్ బంగ్లాకు షిఫ్ట్ అయింది. అక్కడ మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

హోలీ కారణంగా ఈరోజు, రేపు షూటింగ్ కు సెలవులు ఇచ్చారు. మూడో తేదీ నుంచి మళ్లీ మొదలు. అక్కడ్నుంచి 4రోజుల పాటు మరికొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారట. అప్పుడు గుమ్మడికాయ కొడతారని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ విడుదల కార్యక్రమం దశలవారీగా కొనసాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఎంత సక్కగున్నావే పాట కోటి వ్యూస్ దాటేసింది. రేపు మరో పాటను విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. మార్చి 30న రంగస్థలం సినిమా థియేటర్లలోకి రానుంది.