రంగస్థలం 1985 vs మహానటి

రెండూ చిత్రంగా వైవిధ్యమైన సినిమాలే. అలనాటి కాలమానపరిస్థితులను కళ్లకు కట్టే సినిమాలే. 1970వ దశకం వరకు తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు అభిమాన నటి అయిన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తయారవుతున్న…

రెండూ చిత్రంగా వైవిధ్యమైన సినిమాలే. అలనాటి కాలమానపరిస్థితులను కళ్లకు కట్టే సినిమాలే. 1970వ దశకం వరకు తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు అభిమాన నటి అయిన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తయారవుతున్న సినిమా ఒకటి. 1980ల నాటి కాలమాన పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల పరిస్థితులను కళ్లకు కడుతూ ముస్తాబవుతున్న సినిమా మరొకటి.

ఒకదారికి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తనకు మాంచి టాలెంట్, అభిరుచి రెండూ ఉన్నాయని నిరూపించుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్. మరొక సినిమాకు ఇప్పటికే వైవిధ్యమైన సినిమాలు అందించిన సుకుమార్ దర్శకుడు.

ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఢీకొనబోతున్నాయి. మార్చి 29న విడుదల కాబోతున్నాయి. సరిగ్గా పరీక్షల సీజన్ పూర్తయ్యే సరికి ఫ్యామిలీల కోసం ఈ రెండు సినిమాలు రెడీ గా వుంటాయి. సావిత్రి అనగానే ఇప్పుడు నలభైలు దాటిన వారందరికీ ఇష్టమే. వారందరూ తప్పకుండా ఆమె సినిమా చూడాలని ఫీలవుతారు. ఇక 1980నాటి కాలాన్ని వెనక్కు వెళ్లి చూడాలనుకునే వారంతా రంగస్థలం వైపు మొగ్గుతారు.

మొతానికి రాబోయే సమ్మర్ ఫ్రారంభంలో మంచి సినిమాలతో బోణీ అవుతోంది.