Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మాజీ బాయ్ ఫ్రెండ్స్ తోనూ ర‌ష్మిక‌కు మంచి సంబంధాలే!

మాజీ బాయ్ ఫ్రెండ్స్ తోనూ ర‌ష్మిక‌కు మంచి సంబంధాలే!

త‌న ఎక్స్ ల‌వ‌ర్స్ తో కూడా త‌న‌కు స‌త్సంబంధాలే ఉన్నాయ‌ని ప్ర‌క‌టించుకుంది న‌టి ర‌ష్మిక‌. బాలీవుడ్ ప్రాజెక్టులో బిజీగా ఉన్న ర‌ష్మిక అక్క‌డి సినిమా ప్ర‌చారంలో త‌న మాజీ ప్రియుల గురించి స్పందించింది. *గుడ్ బై* అనే సినిమా ప్ర‌మోష‌న్లో ఉన్న ర‌ష్మిక‌, త‌న మాజీ ప్రియుల‌తో త‌న‌కు ఇప్ప‌టికీ ప‌ల‌క‌రించుకోగ‌ల సంబంధాలే ఉన్నాయ‌ని చెప్పింది.

ఇంత‌కీ త‌న మాజీ ప్రియులెంత‌మందో ర‌ష్మిక చెప్ప‌లేదు కానీ, వారు ఎదురుప‌డితే హాయ్.. చెప్ప‌గలిగినంత సాన్నిహిత్యం ఉంది అంటోంది. వారితోనే కాదు..త‌న మాజీ ప్రియుల కుటుంబంతో కూడా ప‌ల‌క‌రించగ‌లిగే చ‌నువు ఉంద‌ట‌. ప్రేమ ప‌రంగా త‌మ‌కు బ్రేక‌ప్ జ‌రిగినా.. చ‌క్క‌గా ప‌ల‌క‌రించుకోవ‌డానికి ఎలాంటి ఇబ్బంది లేద‌ని ర‌ష్మిక అంటోంది.

కెరీర్ ఆరంభంలోనే ఒక క‌న్న‌డ న‌టుడితో ర‌ష్మికకు ఎంగేజ్ మెంట్ అయ్యింది. తెలుగు ఎంట్రీ ఇవ్వ‌క ముందే ఈమె పెళ్లికి ప్రిపేర్ అయ్యి, ఎంగేజ్ మెంట్ చేసుకుంది. అయితే ఆ ఎంగేజ్ మెంట్ కూ, పెళ్లికి కాస్త గ్యాప్ ఉండ‌టం, ఆ గ్యాప్ లోనే తెలుగులో *ఛ‌లో* *గీతాగోవిందం* వంటి సినిమాల హిట్ ల‌తో ఈమె కెరీర్ ఒక్క‌సారిగా పుంజుకోవ‌డంతో... ర‌ష్మిక త‌న నిర్ణ‌యాన్ని స‌మీక్షించుకున్న‌ట్టుగా ఉంది. కెరీర్ మీద కాన్స‌న్ ట్రేట్ చేస్తూ.. పెళ్లిని వాయిదా వేసుకుంది. ఎంగేజ్ మెంట్ ను ర‌ద్దు చేసుకుంది.

ఈ వైనంపై క‌న్న‌డ ఫ్యాన్స్ ర‌ష్మిక‌పై విరుచుకుప‌డ్డారు. ఆమె డ‌బ్బు వేట‌లో ఉంద‌ని, ఫేమ్ కోసం ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్న స్వార్థ‌ప‌రురాలు అని రష్మిక‌ను వారు నిందించారు. అయితే వాటిని ఆమె లెక్క చేయ‌లేదు. అలాగే ఎంగేజ్ మెంట్ ర‌ద్దు కావ‌డాన్ని స‌ద‌రు క‌న్న‌డ హీరో కూడా స్వాగ‌తించాడు. ఆమెను ప్ర‌త్యేకంగా త‌ప్పు ప‌ట్ట‌లేదు.

బ‌య‌ట వాళ్లు త‌న‌ను ఏమ‌నుకున్నా.. త‌న మాజీ ప్రియులు మాత్రం ద్వేషించ‌డం లేద‌ని, బ్రేక‌ప్ ల త‌ర్వాత కూడా వారితో సత్సంబంధాలు ఉన్నాయంటూ ర‌ష్మిక ఇలా అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు చెప్పుకుంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?