Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ సినిమా-మళ్లీ వెనక్కు

రవితేజ సినిమా-మళ్లీ వెనక్కు

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో రవితేజ ఇప్పడు కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాడు. స్క్రిప్ట్ లు, వాటి వైనాలు, బాగోగులు పట్టించుకుంటున్నాడు. దాని ఫలితమే ఈనెలలో ప్రారంభం కావాల్సిన సినిమా కాస్తా మరో నెల వెనక్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. యుఐ ఆనంద్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. రామ్ తాళ్లూరి నిర్మాత.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చలేదట రవితేజకు. ఫస్ట్ హాఫ్ మళ్లీ రీసెట్ చేయమని కోరినట్లు తెలుస్తోంది. దాంతో డైరక్టర్ ఆనంద్ ఇప్పుడు ఆ పనిలోపడ్డారు. అందువల్ల ఈ నెలలో సెట్ మీదకు వెళ్లాల్సిన సినిమా వచ్చేనెల నుంచి వెళ్తుందని అంటున్నారు.

కేవలం తన రెమ్యూనిరేషన్ చూసుకుని, డైరక్టర్లు, స్క్రిప్ట్ గురించి పట్టించుకోకుండా వుండడంతో, రవితేజ వరుసగా భయంకరమైన ఫ్లాపులను చవి చూసారు. సినిమాలు బాగుండవని ముందే తెలిసీ, రవితేజ తన సన్నిహితుల దగ్గర ముందే చెబుతున్నారు. అంతే కానీ వాటిని ఎలా బాగు చేయాలని పట్టించుకున్న దాఖలాలేదు.

కానీ ఈసారి మాత్రం స్క్రిప్ట్ లెవెల్ నుంచి జాగ్రత్త పడుతున్నారు అంటే మంచిదే. కానీ ఇప్పటికే రవితేజ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. సరైన సినిమా, సరైన హిట్ వస్తే తప్ప మళ్లీ కోలుకోదు.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?