కెరీర్ డౌన్ ఫాల్ లో వున్నపుడు నిర్మాతలు బేరాలు ఆడడం కామన్, హీరోలు అటు ఇటుగా చేసేయడం కామన్. కానీ రవితేజ రూటే సెపరేటు. రాజా ది గ్రేట్ కు ముందు రవితేజ కెరీర్ మరీ అంత అద్భుతంగా ఏమీలేదు. కాస్త తేడాగానే వుంది. అలాంటి టైమ్ లో దిల్ రాజుతో అనిల్ రావిపూడి సబ్జెట్ వచ్చింది. అంతా ఓకె అయింది. రెమ్యూనిరేషన్? పది కోట్లకు పైసా తగ్గనన్నాడట రవితేజ. చేస్తే పది కోట్లకే సినిమాలు చేస్తా, లేదంటే లేదు. హ్యాపీగా కూర్చుంటా అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసాడట. ఆఖరికి దిల్ రాజు దానికే సరే అన్నాడని వినికిడి.
అయినా కూడా దిల్ రాజు లక్కీనే. హిందీ డిజిటల్ శాటిలైట్ 7కోట్లు, తెలుగు 11కోట్లు వచ్చింది. థియేటర్ రైట్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా 18కోట్ల మేరకు బిజినెస్ చేసారు. అంటే దగ్గర దగ్గర ముఫై ఆరు కొట్లు వెనక్కు వచ్చింది. సినిమాకు అయిన ఖర్చు పోగా ఓ ఆరేడు కోట్లు లాభం. ఇక ఎప్పటి లాగే నైజాం, ఉత్తరాంధ్ర దిల్ రాజు దగ్గరే వున్నాయి. పైగా కృష్ణాలో కాస్త వాటా వుంది. సో, ఎలా లేదన్నా వీటి ద్వారా ఎంతో కొంత వస్తుంది.