రవితేజ సినిమాకు నిర్మాత ఎవరు?

ఉన్నట్లుండి కొత్త డైరక్టర్ తో సినిమా అంటూ ప్రకటించేసాడు హీరో రవితేజ. తన తాజా సినిమా బెంగాల్ టైగర్ విడుదల మరో వారం రోజులు వుండగానే అతగాడు ఈ ప్రకటన చేసేసాడు. కానీ నిర్మాత…

ఉన్నట్లుండి కొత్త డైరక్టర్ తో సినిమా అంటూ ప్రకటించేసాడు హీరో రవితేజ. తన తాజా సినిమా బెంగాల్ టైగర్ విడుదల మరో వారం రోజులు వుండగానే అతగాడు ఈ ప్రకటన చేసేసాడు. కానీ నిర్మాత ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. బెంగాల్ టైగర్ ప్రాజెక్టు అనుకున్నపుడు కూడా నిర్మాత ఒకంతట సెట్ కాలేదు. తరువాత సినిమా దిల్ రాజు చేస్తున్నాడు ఓకె. 

కానీ ఈ రాబోయే సినిమాకు నిర్మాత ఎవరో? రవితేజ మార్కెట్ ఇటీవల చాలా తగ్గింది. పాతిక కోట్ల మేరకు వుంది. సినిమా మేకింగ్ 15 నుంచి ఇరవై లోపు అయితే తప్ప, నిర్మాత గట్టెక్కరు. కానీ రవితేజ లాంటి హీరో అంటే నిర్మాణ వ్యయం ఇరవైని దాటించేస్తున్నారు. అదే సమస్యగా వుంది. మరి ఈసారి రవితేజ తో సినిమా చేయడానికి ఎవరు ముందుకు వస్తారో?