Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ పక్కన కూడా అనుపమ

రవితేజ పక్కన కూడా అనుపమ

పాప బాగుంది..టాలీవుడ్ జనాలకు నచ్చేసింది..అందుకే సినిమాల మీద సినిమాలు పడుతున్నాయి. ఆ పాపే..ప్రేమమ్ పాప..అనుపమ పరమేశ్వరన్. నాగ్ చైతన్య  ప్రేమమ్ తెలుగు వెర్షన్ కోసం ఇటీవల ఇక్కడకు వచ్చింది. ఫోటోషూట్ చేసింది. త్రివిక్రమ్ కు కూడా నచ్చేసింది. నితిన్ పక్కన రెండో చాన్స్ కొట్టేసింది. 

ఇప్పుడు నిర్మాత దిల్ రాజు దృష్టిలో పడిపోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నిర్మించే సినిమాకు కూడా ఆమెనే లాక్ చేసేసారు. మరి మూడు సినిమాలు ఓకేసారి. ఎలా మేనేజ్ చేస్తుందో ఏమో? ప్రస్తుతానికి అయితే అమ్మడు పారితోషికం తక్కువే వుంది. ఇరవై లక్షల రేంజ్ లో. ఒక్క హిట్ పడాలి. కోటికి పెరిగిపోదూ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?