వైట్లకు కొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు

రెండు అట్టర్ ఫ్లాప్ ల తర్వాత ఎలాగోలా రవితేజ సినిమా పట్టాడు. అటు 'మైత్రీ' నిర్మాతల్ని కూడా ఒప్పించాడు. లొకేషన్ల వేట కోసం అమెరికాకు కూడా వెళ్లాడు. ఇక ఈ ప్రాజెక్టును రవితేజ అఫీషియల్…

రెండు అట్టర్ ఫ్లాప్ ల తర్వాత ఎలాగోలా రవితేజ సినిమా పట్టాడు. అటు 'మైత్రీ' నిర్మాతల్ని కూడా ఒప్పించాడు. లొకేషన్ల వేట కోసం అమెరికాకు కూడా వెళ్లాడు. ఇక ఈ ప్రాజెక్టును రవితేజ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడమే ఆలస్యం. కానీ వైట్లకు మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు. రవితేజ మరో సినిమా ఎనౌన్స్ చేయబోతున్నాడు.

ప్రస్తుతం రవితేజ లిస్ట్ లో కల్యాణ్ కృష్ణ, శ్రీనువైట్ల ఉన్నారు. వీళ్లిద్దర్లో శ్రీనువైట్ల సినిమానే రవితేజ ఎనౌన్స్ చేస్తాడని అంతా ఊహించారు. కానీ రవితేజ మాత్రం కల్యాణ్ కృష్ణకు ఛాన్స్ ఇచ్చాడు. రేపు లేదా ఎల్లుండి కల్యాణ్ కృష్ణతో చేయబోయే సినిమానే ప్రకటించబోతున్నాడు. దీంతో వైట్ల సినిమా మరోసారి వెనక్కి వెళ్లింది. గతంలో ఆదితో చుట్టాలబ్బాయ్ సినిమాను నిర్మించిన వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి ఈ సినిమాను తీస్తారు.

నిజానికి వెంకటేష్ తో సినిమా చేద్దామనుకున్నాడు కల్యాణ్ కృష్ణ. స్టోరీ కూడా వినిపించాడు. కానీ సురేష్ బాబు, వెంకీల నాన్చుడు కారణంగా ఆ ప్రయత్నాలు మానుకున్నాడు. వెంటనే రవితేజను కలవడం, సినిమా ఓకే అవ్వడం చకచకా జరిగిపోయాయి. అలా కల్యాణ్ కృష్ణ ముందుకు, వైట్ల వెనక్కు అయిపోయారు.