రవితేజ సినిమాకు మోక్షం

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తరువాత  హీరో రవితేజ సినిమా సెట్ మీదకు వెళ్లబోతుంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా యుఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా ఫిక్స్ అయి చాలా రోజులు అయింది. కానీ సెట్ మీదకు…

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తరువాత  హీరో రవితేజ సినిమా సెట్ మీదకు వెళ్లబోతుంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా యుఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా ఫిక్స్ అయి చాలా రోజులు అయింది. కానీ సెట్ మీదకు వెళ్లడం కనిపంచడం లేదు. 

మరోపక్క కథలో రవితేజ మార్పులు అడిగారని, నిర్మాత హీరోను రేటు తగ్గించుకోమంటున్నారని వార్తలు పుట్టుకు వచ్చాయి. అయినా కూడా సినిమా మాత్రం సెట్ మీదకు వెళ్లలేదు.

ఆఖరికి ఇప్పుడు వెళ్తోంది. దీని వెనుక చిన్న చమక్కు వుందని తెలుస్తోంది. రవితేజతో సినిమా ఎంతకు సెట్ మీదకు వెళ్లకపోవడం గమనించి, వేరే బ్యానర్ జనాలు దర్శకుడు ఆనంద్ కు ఓ ఆఫర్ పంపారు. అది ఓ రీమేక్ ఆఫర్. రవితేజ ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది అనుకుంటే, వచ్చి మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ చేయమని ఆనంద్ కు ఆఫర్ అందించారు. 

దీంతో ఆనంద్ వేరేప్రాజెక్టు మీదకు వెళ్లే పరిస్థితి వస్తోందని గ్రహించి, అర్జెంట్ ఇక గ్యాప్ లేకుండా రవితేజ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తరువాత తనకు ఆఫర్ వచ్చిన ప్రాజెక్ట్ చేస్తారట ఆనంద్.