రెజీనా.. శివ మనసులో శృతి అంటూ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి మరీ గ్యాప్ ఎక్కువా లేకుండా, తక్కువా లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం కాస్త ఎక్కువ గ్యాప్ కనిపించేటట్లు వుంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు లెక్కేసుకోవాలంటే సెట్ మీద తెలుగు సినిమా ఏదీ లేనట్లే.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఏదో ఆడింది..అంటే ఆడింది అనిపించుకుంది. సౌఖ్యం పెద్ద డిజాస్టర్..సరే తట్టుకుని, ప్రయత్నాలు చేస్తుంటే శౌర్య పేరుతో మరో డిజాస్టర్ పలకరించింది. ఎప్పుడో దాదాపు వర్క్ పూర్తి చేసిన నారా రోహిత్ శంకర విడుదల కావాల్సి వుంది. అంతకు మించి తెలుగులో ప్రస్తుతానికి సినిమాల్లేవు.
అప్పటికీ వీలయినపుడల్లా ఫంక్షన్ లకు బ్యాక్ లెస్ గా, ఇంకా చాలా చాలా టెంప్టింగ్ గా డ్రెస్ చేసుకుని వస్తోంది. అయినా పెద్ద హీరోలు ఎవరూ రెజీనాకు ఆఫర్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ డిజాస్టర్ల పుణ్యమా అని మీడియం హీరోల దగ్గరా ఆఫర్లు లేవు. తమిళంలో రెండు చేతిలో వున్నాయి. అవి అయ్యేలోగా ఏదయినా సినిమా పట్టుకోవాలి రెజీనా..లేదూ అంటే జనం మరిచిపోతారు.