రీమేక్ బిజీలో కలెక్షన్ కింగ్

ఎలాగైనా మాంచి సోలో సినిమా తీసి హిట్ కొట్టాలనే ప్రయత్నంలో వున్నారట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆ పని కూడా ఆర్జీవీపైనే వేసారు. గతంలో హిందీలో హిట్ అయినా  ఓ మాంచి భారీ…

ఎలాగైనా మాంచి సోలో సినిమా తీసి హిట్ కొట్టాలనే ప్రయత్నంలో వున్నారట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆ పని కూడా ఆర్జీవీపైనే వేసారు. గతంలో హిందీలో హిట్ అయినా  ఓ మాంచి భారీ సినిమా రీమేక్ హక్కులు కొని, పరుచూరి బ్రదర్స్ కు అప్పచెప్పారు. ఈ సినిమా కోసమే మోహన్ బాబు డిఫరెంట్ గెటప్ కూడా ట్రయ్ చేస్తున్నారు. దర్శకత్వం మాత్రం ఆర్జీవీనే. 

హిందీలో మాంచి పేరు, పైసలు తెచ్చుకున్న సినిమా, పైగా తెలుగు నేటివిటీక సూటవుతుందని భావించి, పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇదిలా వుంటే రావణ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, అన్నమయ్య, రామదాసు సినిమాల రచయిత భారవి ఓ స్క్రిప్ట్ తయారుచేసి, మోహన్ బాబు పరిశీలనకు ఇచ్చారని కూడా తెలుస్తోంది. అంటే మోహన్ బాబు నుంచి మరో రెండు మంచి సినిమాలు ఆశించవచ్చు.