రెమ్యూనిరేషన్లు తగ్గించండి-గిల్డ్ హుకుం?

సినిమా రంగంలోని హీరోలు, హీరోయిన్లతో సహా నటీనటులందరికీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రతి ఒక్కరు తమ రెమ్యూనిరేషన్ 20 శాతం తగ్గించుకోవాల్సిందే అంటూ గిల్డ్ పెద్దలు దిల్ రాజు అండ్…

సినిమా రంగంలోని హీరోలు, హీరోయిన్లతో సహా నటీనటులందరికీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రతి ఒక్కరు తమ రెమ్యూనిరేషన్ 20 శాతం తగ్గించుకోవాల్సిందే అంటూ గిల్డ్ పెద్దలు దిల్ రాజు అండ్ కో హుకుం జారీ చేసారు. ఇటీవల గిల్డ్ పెద్దలు సినిమా రంగంలోని మేనేజర్లు అందరితో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీరు వారు అని కాకుండా ప్రతి నటి, నటుడి తరపున పనిచేసే ప్రతి మేనేజర్ ను సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశంలో గిల్డ్ పెద్దలు రెమ్యూనిరేషన్ తగ్గింపు సూచన చేసినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నటీనటులు అందరూ తమ తమ రెమ్యూనిరేషన్లు 20శాతంతగ్గించుకోవాల్సిన అవసరం వుందని ఈ మేరకు మేనేజర్లు వారికి పరిస్థితి వివరించాలని కోరినట్లు బోగట్టా.

రెండు అంచెల వ్యూహం

ఇదిలా వుంటే యాక్టివ్ ప్రొడ్యసర్స్ గిల్డ్ రెండు అంచెల వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పెద్ద హీరోలు,  డిమాండ్ వున్న హీరోలతో గిల్డ్ కు బేరాలు కుదరవు. పెద్ద హీరోలు ఎంత అడిగితే అంతా మొహమాటాల్లేకుండా, బేరాల్లేకుండా చెల్లించేసుకోవాల్సిందే. ఇప్పుడు హడావుడి అంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, మిగిలిన చిన్న చితక ఆర్టిస్టుల రెమ్యూనిరేషన్ కోసేసి, ఆదా చేసుకోవడానికే. 

అయితే పెద్ద హీరోల దగ్గర బేరాలకు మరో పద్దతి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులు అన్నీ ఓకె అయినా, వెంటనే ప్రారంభించకుండా వుండడం ఆ పద్దతి. మార్కెట్ తెలియకుండా ఎలా ప్రారంభిస్తాం? అన్నది ఇక్కడ రెడీగా ఆన్సర్ గా పెట్టుకుంటున్నారు. మార్కెట్ ఎలా వుంటుందో తెలియకుండా కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు ఎలా ఇస్తాం? అనే పాయింట్ ను మెల్లగా ఇండస్ట్రీలోకి పంపిస్తున్నారు. 

అంతే కాదు, వచ్చే ఏడాది సంక్రాంతి పరిస్థితి చూసిన తరువాత, సమ్మర్ నాటికి థియేటర్లు ఎలా వుంటాయో చూసిన తరువాత కానీ సినిమాలు ప్రారంభించము అనే కాన్సెప్ట్ తో గిల్డ్ జనాలు వున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్ మామూలుగా వుంటే సమస్యే లేదు. లేదూ అంటే అప్పుడు మరీ టాప్  హీరోలు అంటే మహేష్, పవన్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్ ను వదిలేసినా మిగిలిన సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ హీరోల రెమ్యూనిరేషన్లు తగ్గించవ్చు అన్నది ప్రొడ్యూసర్లు ఆలోచనగా తెలుస్తోంది.

అయితే టాలీవుడ్ లో ఏ రేంజ్ హీరో అయినా డిమాండ్-సప్లయ్ సిద్దాంతమే వర్తిస్తుంది. అందవల్ల అక్కడ పెద్దగా ప్లాన్ చేసేది, వర్కవుట్ చేసేది ఏమీ వుండదు. ఈ హడావుడి అంతా మిగిలిన ప్యాడింగ్ ఆర్టిస్ట్ ల దగ్గర ఆదా చేయడం కోసమే.

జగన్ ను కొట్టాలంటే మరో వ్యూహం లేదా?