రెండో పార్ట్ కు రంగులద్దే ప్రయత్నం

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ అమ్మకాలు అయిపోయాయి. దానికి రావాల్సిన బజ్ వస్తూంది కూడా. కానీ సమస్య అల్లా రెండో భాగంతోనే. దాన్నిండా వుండేది పొలిటికల్ లైఫ్ నే. ఫ్యామిలీ ఆడియన్స్ కు దాని…

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ అమ్మకాలు అయిపోయాయి. దానికి రావాల్సిన బజ్ వస్తూంది కూడా. కానీ సమస్య అల్లా రెండో భాగంతోనే. దాన్నిండా వుండేది పొలిటికల్ లైఫ్ నే. ఫ్యామిలీ ఆడియన్స్ కు దాని మీద జీరో ఇంట్రస్ట్ వుంటుంది.

అందుకే దానికి రంగులు అద్ది, క్రేజ్ తెచ్చే ప్రయత్నం స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. తొలిభాగం అమ్మకాలతో మలిభాగం అమ్మకాలు సమాంతరంగా చేయలేదు. ఓవర్ సీస్ లో మాత్రం రెండు కలిపి అమ్మారు. ఇక్కడ ఇంకా మాటల వరకే వుంది వ్యవహారం.

సో, రెండోభాగం విక్రయించాలి అంటే దానికి కూడా కాస్త హడావుడి వుండాలి. అందుకే రెండో భాగంలో ఏవో అద్భుతాలు వుంటాయన్న ఫీలర్లు బయటకు వదులుతున్నారు. ఆ మేరకు కథనాలు వండి వార్పిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండోభాగం అమోఘం.. ట.. అందులో ఏదో (అదేదో తెలియదు) వుంటుంద.. ట.. అంటూ కథనాలు కనిపిస్తున్నాయి.

నిజానికి అలావుండే అవకాశం ఎలా వుంటుంది? ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలు అయిదారే. ఒకటి చైతన్య యాత్ర, రెండు ఆగస్టు సంక్షోభం. మూడు మూకుమ్మడిగా మంత్రులను తీసేయడం, నాలుగు లక్ష్మీపార్వతి ఎంట్రీ.

ఆపై చంద్రబాబు వెన్నుపోటు, పార్టీ చేజారి ఎన్టీఆర్ రోడ్లమీద తిరుగుతూ, చంద్రబాబును విమర్శిస్తూ మీటింగ్ లు పెట్టడం. వీటిల్లో మొదటి రెండు చూపించగలరు కానీ మిగిలినవి చూపించలేరు. అందువల్ల రెండోభాగంలో ఇక అద్భుతాలు ఏముంటాయి? ఆసక్తి ఎలా కలుగుతుంది?

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? …చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్