ఎఫ్ 2 సినిమాతో తిరుగులేని హిట్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అలాంటి డైరక్టర్ ను దిల్ రాజు వదులుకోరు. పైగా దిల్ రాజు మాదిరిగా కాంబినేషన్లు సెట్ చేయడం అంత వీజీకాదు అందరికీ. అందుకే మళ్లీ మరో సినిమా దిల్ రాజకు చేయాలని అనిల్ రావిపూడి డిసైడ్ అయ్యారు. అయితే ఆ సినిమా బయటకు వెళ్లి ఓ సినిమా చేసి వచ్చాకా? లేదా దీని తరువాతేనా అన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదు.
కానీ ఎఫ్2 సినిమాకు కొనసాగింపుగా ఎఫ్ 3 సినిమా చేయాలని మాత్రం ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఎఫ్ 3 సినిమా రెండు సినిమాలకు కొనసాగింపుగా వుండబోతోందని తెలుస్తోంది. రాజా ది గ్రేట్ లోని బ్లయిండ్ క్యారెక్టర్, ఎఫ్-2లోని రెండు క్యారెక్టర్లు తీసుకుని ఎఫ్ 3 సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఎఫ్ 3లో రవితేజ మళ్లీ బ్లయిండ్ క్యారెక్టర్ లో కనిపిస్తారన్నమాట.
రవితేజ, వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ ముగ్గురూ కూడా ఎఫ్ 3లో పార్ట్ అన్నమాట. ఇంత పెద్ద మల్టీ స్టారర్ ఈ మధ్య తెలుగులో రాలేదు. 2020 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ఈ సినిమాను స్టార్ట్ చేయాలన్నది దిల్ రాజు ఆలోచనగా తెలుస్తోంది. ఎఫ్ 2 సంబరాలు ముగిసాక దీనిపై దృష్టి పెడతారు.