రెండు వారాలు దాటినా అదే ప్రచారమా?

సినిమా విడుదలైన వారం సూపర్ అంటే ఓకె. రెండో వారం కూడా సూపరో..సూపరు అంటే సరే, నమ్మారు. మూడో వారంలోకి ఎంటర్ అయ్యాక కూడా, థియేటర్లు కలెక్షన్లు లేక బావురుమంటున్నా కూడా, కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి…

సినిమా విడుదలైన వారం సూపర్ అంటే ఓకె. రెండో వారం కూడా సూపరో..సూపరు అంటే సరే, నమ్మారు. మూడో వారంలోకి ఎంటర్ అయ్యాక కూడా, థియేటర్లు కలెక్షన్లు లేక బావురుమంటున్నా కూడా, కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి అని చెబితే ఏం అనుకోవాలి.

జనతాగ్యారేజ్ కలెక్షన్లు తొలి పది రోజులు బాగానే వచ్చాయి. ఆ తరువాత డౌన్ అయ్యాయి. బక్రీద్ హాలీడే ఓకె. మళ్లీ  ఆ తరువాత చాలా చోట్ల రెంట్ లు రాలేదు. కొన్ని చొట్ల రెంట్ లు వచ్చాయి అని వినికిడి. ఇలా వుంటే ఈ ఆదివారం జనతా గ్యారేజ్ కుమ్మేసింది అని ఫీలర్లు వదులుతున్నారు. జనతా గ్యారేజ్ స్పెషాలిటీ ఏమిటంటే, కొన్నవాళ్లలో ఎక్కువమంది ఎన్టీఆర్ జనాలు. ఎన్టీఆర్ తో ఆబ్లిగేషన్ వున్నవారు. ఎన్టీఆర్ తరువాతి సినిమాలు కావాల్సిన వారు. ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నవారు. అందువల్ల కలెక్షన్లు ఎంత అన్నది కచ్చితమైన ఫిగర్లు బయటకు రావడం లేదన్నది ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

తొలి పది రోజులు నిత్యం ఇవీ కలెక్షన్లు అని హడావుడి చేసిన వారు, ఆ తరువాత సైలెంట్ అయ్యారంటేనే విషయం అర్థమైపోతుంది. అయినా ఊరుకోకుండా ఇంకా కుమ్మేస్తుంది అని అనడం ఎవరి మెహర్బానీ కోసం అనుకోవాలి? అంటే 80 కోట్లు దాటించాలి షేర్ అని పట్టుదలతో వున్నారేమో? అంత సూపర్ అంటే, మరి అందులో ఎంతో కొంత ఓవర్ సీస్ లో కూడా వుండాలిగా..మరి అక్కడేమయింది? పాపం?