రజనీకాంత్, శంకర్ల 'రోబో' సీక్వెల్ సెట్స్ మీదకి వెళ్లేటపుడు వారి ముందున్న టార్గెట్ చిన్నదే. 'బాహుబలి: ది బిగినింగ్'ని మించిన సక్సెస్ సాధించడం కోసం అక్షయ్‌కుమార్‌ని విలన్‌గా పెట్టుకుని, భారీ బడ్జెట్ కేటాయించుకుని '2.0'ని సెట్స్ ఎక్కించారు.
తీరా ఆ చిత్రం పూర్తి కాకముందే టార్గెట్‌ని మూడింతలు చేస్తూ 'బాహుబలి: ది కన్‌క్లూజన్' సంచలనం చేసింది. '2.0'కి 'బాహుబలి 2' రికార్డులని కొట్టాల్సిన పని లేదు కానీ, అంచనాలైతే ఇప్పుడు ఆ రేంజ్‌లోనే వున్నాయి.
రజనీకాంత్, శంకర్ కలిసి ఇంత భారీ బడ్జెట్ చిత్రంతో 'బాహుబలి 2'ని దాటలేకపోతే ఫెయిలైనట్టేనని అభిమానులు ఫీలవుతున్నారు. పైగా అక్షయ్‌కుమార్ వల్ల బాలీవుడ్ అడ్వాంటేజ్ కూడా వుండడంతో '2.0' టీమ్‌పై ప్రెజర్ ఎక్కువ వుంది.
రిలీజ్ టైమింగ్ నుంచి, ప్రీ రిలీజ్ పబ్లిసిటీ వరకు అన్నిట్లోను జాగ్రత్తలు తీసుకోకపోతే బాహుబలి 2 రికార్డులని కొట్టినా లేకున్నా, దానికి దగ్గరగా వెళ్లడం '2.0'కి కష్టమవుతుంది. జనవరి 25న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ వేసవిలో విడుదల చేయడం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ వుంటుందని భావిస్తున్నారట.
బాహుబలి 2 వేసవిలో విడుదల కావడం వల్ల నాలుగు వారాల పాటు దాదాపు అన్ని భాషల్లోను పోటీ లేని రన్ తెచ్చుకుంది. అందుకే 2.0కి కూడా అదే బెస్ట్ థియరీ అనుకుంటున్నారట. వేసవిలో వస్తే రజనీకి బాహుబలిని దాటే పవర్ చేకూరుతుందో లేదో అనేది చూడాలిక.