రోహిత్-బాలకృష్ణుడు-రమ్యకృష్ణ

నారా రోహిత్ ఈసారి మాంచి టైటిల్ తో జనం ముందుకు రాబోతున్నాడు. బాలకృష్ణుడు, అదీ టైటిల్. ఈ సినిమా ఇంకో విశేషం ఏమిటంటే, బాహుబలితో తన సత్తా ఏమిటో మరోసారి చాటిన రమ్యకృష్ణ ఈ…

నారా రోహిత్ ఈసారి మాంచి టైటిల్ తో జనం ముందుకు రాబోతున్నాడు. బాలకృష్ణుడు, అదీ టైటిల్. ఈ సినిమా ఇంకో విశేషం ఏమిటంటే, బాహుబలితో తన సత్తా ఏమిటో మరోసారి చాటిన రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం. మాయాబజార్ మూవీస్ పతాకంపై మహేంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

నారా రోహిత్ తో కలిసి జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ కొట్టిన రెజీనా మరోసారి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ మల్లాల దర్శకుడు. నారారోహిత్ తన కెరీర్ లో 14 సినిమాలు చేసిన తరువాత ఈ సినిమాలో తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం విశేషం. ఇలా ఇన్ని విశేషాలతో తయారవుతోంది నారారోహిత్ బాలకృష్ణుడు.