వైవిధ్యమైన సినిమాలు ఆచి తూచి చేసుకుంటూ వస్తున్న హీరో నారా రోహిత్. కానీ ఫిజిక్ మీద మాత్రం ఎందుకో కాస్త అశ్రద్ధ. అలా అనుకోవాలో లేదా అతని ఫిజిక్ అతని మాట వినడం లేదని అనుకోవాలో? కానీ ఇప్పుడు చాలా పట్టుదలగా, సైలెంట్ కష్టపడిపోయినట్లు తెలుస్తోంది. మాంచి ట్రయినర్ ను పెట్టుకుని, సిక్స్ ప్యాక్ సాధించినట్లు వినికిడి.
నారా రోహిత్ లాంటి పిజిక్ వున్నవారు సిక్స్ ప్యాక్ చేయడం అంటే అంత సులువు కాదు. గతంలో హెవీగా వుండే సునీల్ కూడా కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించారు. అలాగే ఆ మధ్య కళ్యాణ్ రామ్ కూడా సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు.
త్వరలో నారా రోహిత్ తన సిక్స్ ప్యాక్ బాడీని రివీల్ చేస్తూ, అందుకు తగిన సబ్జెక్ట్ తో ఓ సినిమా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా టైమ్ లోనే రోహిత్ సిక్స్ ప్యాక్ ను రివీల్ చేస్తారు.
సిక్స్ ప్యాక్ అక్కర లేదు కానీ, కాస్త స్లిమ్ ఫిట్ నెస్ తో వుంటే చాలు, అతను ఎంచుకునే వైవిధ్యమైన సబ్జెక్ట్ లకు నారా రోహిత్ సినిమాలు అలరిస్తాయి.