సాధారణంగా పూరిజగన్నాధ్ దర్శకుడు అంటే సినిమాకు శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి థియేటర్లో షో పడే వరకు స్వయంగా చూసుకుంటాడు. పైగా పూరి సినిమాలను ప్యాకేజ్ ల లెక్కన తీస్తాడు కాబట్టి, అమ్మకాలు, పబ్లిసిటీ వైపు కూడా ఒక కన్నేసి వుంచుతాడు. పూరి లేటెస్ట్ మూవీ రోగ్ కూడా ప్యాకేజ్ ప్రొడక్ట్ నే. 20 కోట్లకు కాస్త అటు ఇటుగా ఫస్ట్ కాపీ తీసి చేతిలో పెట్టాడు.
అయితే ఇప్పుడు రోగ్ ను ఎంత ప్రమోట్ చేద్దామని ప్రయత్నించినా వీలు కావడం లేదు. అమ్మకాలు సాధ్యం కావడం లేదు. పూరి గత సినిమాల ట్రాక్ రికార్డు ఫలితం ఇది. దీంతో అడియో ఫంక్షన్ వరకు అన్నింటి తానే హల్ చల్ చేసిన పూరి కనెక్ట్స్ ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. నిర్మాత మనోహర్ నే నేరుగా సినిమాను విడుదల చేసుకుంటున్నారు.
సినిమా పబ్లిసిటీ, విడుదల వంటి వ్యవహారాలన్నీ అటు కన్నడ, ఇటు తెలుగులో నిర్మాతే చూసుకుంటున్నారు. పూరి తన తరువాతి సినిమా మీద బిజీ అయిపోయారు. రోగ్ ను నిర్మాత కు వదిలేసారు. రోగ్ సినిమా ఈనెలాఖరున 31న విడుదలవుతోంది. ఇటు కాటమరాయుడు, అటు చెలియా వంటి సినిమాలతో పోటీ పడబోతోంది.