రూటు మార్చాలనుకుంటున్న రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ తప్పటడుగులు వేస్తున్న వైనాన్ని, దానివల్ల పెద్ద నిర్మాణ సంస్థలు, డైరక్టర్లు, విజయ్ దేవరకొండతో చకచకా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్న వైనం ఇటీవల ఓ కథనంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కథనం తరువాత…

రాజ్ తరుణ్ తప్పటడుగులు వేస్తున్న వైనాన్ని, దానివల్ల పెద్ద నిర్మాణ సంస్థలు, డైరక్టర్లు, విజయ్ దేవరకొండతో చకచకా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్న వైనం ఇటీవల ఓ కథనంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కథనం తరువాత రాజ్ తరుణ్ తన స్ట్రాటజీ మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

కొంతమందిని రాజ్ తరుణ్ నేరుగా కాకున్నా, మధ్యవర్తుల ద్వారా సంప్రదిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ తో ఓ సినిమా ప్లాన్ చేయమని వాళ్లు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. 

రాజ్ తరుణ్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే శతమానం భవతి, నేను లోకల్ ఇంకా మరికొన్ని మంచి ప్రాజెక్టుల చేజార్చుకున్నారని ఇలా అడిగించుకున్న వారే కామెంట్ చేస్తున్నారు. ఇకనైనా పెద్ద సంస్థలను కాస్తయినా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.