రామరాజు ఫర్ భీమ్ అంటూ వదిలిన ఆర్ఆర్ఆర్ విడియో పై అనేక ఆనందాలు. అదే సమయంలో అనేక విమర్శలు. ముఖ్యంగా ఎన్టీఆర్ ముస్లిం గెటప్ మీద. నైజాం మీద అవిశ్రాంత పోరు సలిపిన కొమరం భీమ్ కు ముస్లిం గెటప్ నా అని ఒక్కపక్క, రాజమౌళి ముందే చెప్పాడు కదా ఫిక్షన్ సినిమా అని ఇంకో పక్క కామెంట్ లు.
అయితే అల్లూరి రామరాజు, కొమరం భీమ్ కొన్నాళ్లు అజ్ఞాతవాసం లో వున్నారని అప్పటి కథ అని గతంలో రాజమౌళి చెప్పిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అల్లూరి, కొమరం అంటూనే, అజ్ఞాతంలో కలిసారు అంటూ ఫిక్షన్ అనడం రాజమౌళికే చెల్లింది. అయితే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ అన్నది ఓ కీలక ట్విస్ట్ అని టాలీవుడ్ లో వినిపిస్తోంది.
పోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా వున్నట్లుగా, కొమరం భీమ్ ముస్లిం గెటప్ లో నైజాం అడ్డాలో చేరి తను అనుకున్నది సాధించడం అన్నది సినిమాలో ట్విస్ట్ అని తెలుస్తోంది.
ఇండియా ఓ హిందూ యువకుడిని ఫుల్ గా ట్రయినప్ చేసి, ముస్లింగా మార్చి, పాకిస్థాన్ లో చిరకాలం గూఢచర్యం నిర్వహించేలా చేసిన సంఘటన నుంచి ఇన్ స్పయిర్ అయి, ఈ ఎపిసోడ్ ను ఆర్ఆర్ఆర్ లో చేర్చారని కూడా వినిపిస్తోంది. ఇవన్నీ ఎంత వరకు వాస్తవాలో సినిమా వస్తే కానీ తెలియదు.