ముంబాయి, చెన్నయ్, కేరళ ల్లో ఎక్కడ ఆర్ఆర్ఆర్ ఈవెంట్ జరిగినా ఎన్టీఆర్, చరణ్ లకు జేజేలు వినిపించాయి. చప్పట్లు మారుమోగాయి. ఈలల సంగతి చెప్పనక్కరలేదు. కానీ దీనివెనుక కోటికి పైగానే ఖర్చు అయింది. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఫ్యాన్స్ ను ముంబాయికి తరలించారు.
1500 మంది చరణ్ ఫ్యాన్స్, 1500 మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ప్రత్యేకంగా బస్ లు వేసి ముంబాయి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఫ్రెష్ కావడానికి ఏర్పాట్లు, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ సమకూర్చారు.
అంత సంఖ్యలో కాకపోయినా, కాస్త లిమిటెడ్ గా అయినా తమిళనాడు, కేరళలకు కూడా తీసుకెళ్లారు. ఇలా మొత్తం ఫ్యాన్స్ ను తరలించి, ఆయా ఫంక్షన్లు సందడిగా జరిగేలా ప్లాన్ చేసారు. దీంతో ఆయా స్టేట్స్ లో భలే క్రేజ్ వుంది అనే లుక్ తీసుకువచ్చారు.
ఇలా మొత్తం ప్లానింగ్ కు కోటి రూపాయలకు పైగానే ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఆర్ఆర్ఆర్ హీరోలు, దర్శకుడు చార్టర్ ఫ్లయిట్ లో తిరగడానికి, ముంబాయిలో అయిదు రోజుల పాటు వుండడానికి గట్టిగానే ఖర్చయినట్లు తెలుస్తోంది,. ముంబాయిలో, ఇతర రాష్ట్రాల్లో మీడియా పీఆర్ వర్క్ కు, ఈ ప్రయాణాలకు, టోటల్ గా పబ్లిసిటీ బడ్జెట్ 20 కోట్లు అని వినిపిస్తోంది.