ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు ఏర్పాట్లు

టాలీవుడ్ సినిమాల మీద, డైరక్టర్లు, హీరోల ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద విపరీతంగా ప్రభావం కనబరస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో కదలిక వచ్చినట్లే. పోస్ట్ కరోనా నేపథ్యంలో మరింత ఆలస్యం చేస్తే సమస్య వస్తుందని గమనించిన…

టాలీవుడ్ సినిమాల మీద, డైరక్టర్లు, హీరోల ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద విపరీతంగా ప్రభావం కనబరస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో కదలిక వచ్చినట్లే. పోస్ట్ కరోనా నేపథ్యంలో మరింత ఆలస్యం చేస్తే సమస్య వస్తుందని గమనించిన దర్శకుడు రాజమౌళి ఈ సినిమా షూట్ ను అక్టోబర్ 5 నుంచి వీలయినన్ని జాగ్రత్తలతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు బోగట్టా.

ఇంకా ఆలస్యం చేస్తే సినిమా విడుదల విషయం ఎలా వున్నా, ఇద్దరు హీరోల  ఫ్యూచర్ ప్రాజెక్టులు దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఆ కారణంగా పలువురు దర్శకుల ప్రాజెక్టులు అయోమయంలో పడతాయి. అందుకే అక్టోబర్ 5 నుంచి కొత్త షెడ్యూలు వేయడమే కాదు, గతంలో చేసిన ప్లానింగ్ మొత్తాన్ని పక్కన పెట్టి, మొత్తం కొత్త ప్లానింగ్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈసారి అనుకున్నట్లు షూటింగ్ లు జరిగితే మార్చి, లేదా ఏప్రియల్ నాటికి ఇద్దరు హీరోల పార్ట్ ఆర్ఆర్ఆర్ లో అయిపోతుందని తెలుస్తోంది. అప్పటి నుంచి ఎన్టీఆర్-రామ్ చరణ్ తమ తమ కొత్త ప్రాజెక్టుల మీదకు వెళ్లిపోవచ్చు.  అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు దాదాపు ఆరు నెలలు పాటు ఆర్ఆర్ఆర్ మీద కంటిన్యూగా వర్క్ చేయాల్సి వుంటుంది.

అయితే ఆర్ఆర్ఆర్ కు సంబంధించి నంత వరకు షూటింగ్ పార్ట్ ఆరు నెలలలో ముగిసిపోయినా, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ టైమ్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. సమాంతరంగా చేసినా కూడా 2021 సమ్మర్ కు కానీ, పోస్ట్ సమ్మర్ కు కానీ రావాలి అంటే చాలా కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పార్ట్ అయిపోతే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?