కమ్యూనిస్టులు, నక్సలైట్లు ప్రస్తావన వున్న సినిమాలు వచ్చాయి కానీ, ఇప్పటి దాకా ఆరెస్సెస్ ప్రస్తావన వున్న సినిమాలు రాలేదు. అలాగే 'నమస్తే సదా వత్సలే మాతృభూమి' అనే ఆరెస్సెస్ గీతం ఏ సినిమాలోనూ వినిపించింది లేదు.
ఇప్పుడు ఈలోటు తీరుతోదంట జవాన్ సినిమాలో. ఎన్టీఆర్ ఒకప్పటి మేనేజర్ కృష్ణ నిర్మాతగా మారి జవాన్ సినిమాను బివిఎస్ రవి డైరక్షన్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ హీరో. సినిమా టైటిల్ జవాన్. అయితే జవాన్ అంటే సమాజ శ్రేయస్సు పట్ల అంకిత భావం వున్నవాడు అనే అర్థంలో అన్నమాట. ఈ సినిమాలో హీరో కి ఆరెస్సెస్ మూలాలు వుంటాయట.
'కుటుంబంతో ఎలా వుండాలో నాన్న నేర్పాడు, సమాజంతో ఎలా వుండాలో ఆరెస్సెస్ నేర్పింది' అనే డైలాగు కూడా సినిమా వుంటుందట. అంతే కాదు, నేపథ్యంలో ఆరెస్సెస్ గీతం 'నమస్తే, సదా వత్సలే మాతృభూమి' అన్నది కూడా వినిపిస్తుందట.
మొత్తం మీద చాలా కాలం తరువాత తొలిసారి ఆరెస్సెస్ శాఖ, దాని పద్దతులు సినిమాలో కనిపించబోతున్నాయన్నమాట.