సబ్బం హరికి నో ‘లోకల్’ సపోర్ట్

మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదేనేమో? మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి అసహనంతో అధికారుల మీద, సిఎమ్ జగన్ మీద, ఎంపీ విజయసాయి మీద చెలరేగిపోయి మాట్లాడారు. Advertisement అక్కడ…

మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదేనేమో? మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి అసహనంతో అధికారుల మీద, సిఎమ్ జగన్ మీద, ఎంపీ విజయసాయి మీద చెలరేగిపోయి మాట్లాడారు.

అక్కడ సమస్య వేరు. ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నది వేరు. సుమారు 250 గజాల స్థలం, ఆయనకు సంబంధం లేనిది, ఆయనకు రికార్డెడ్ గా దఖలు కానిది, ఆక్యుపై చేసారు. ఇది ఇవ్వాళ నిన్న జరిగింది కాదు. కానీ ఇన్నాళ్లు సాగిపోయింది. 

ఇప్పుడు ఆయనకు అధికారపక్షానికి చుక్కెదురుగా వుంది కాబట్టి బయటకు వచ్చింది. విశాఖలోని కీలకమైన ప్రాంతాల్లో ఒకటైన సీతమ్మధారలోనిది ఈ స్థలం కాబట్టి కోట్ల విలువైనది. 

ఇక్కడ సబ్బం చేయాల్సింది తిట్లు లంకించుకోవడం కాదు. లీగల్ పాయింట్  తీయగలగడం. కోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ తినిపించడం. బుల్ డోజర్ ఎందుకు తెచ్చారు? నోటీసు ఇవ్వరా? ఇలాంటి ప్రశ్నలు ముంబాయిలో కంగన రనౌత్ కూడా వేసారు. అక్కడ కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు సబ్బం కూడా అదే పని చేయవచ్చు కదా?

కానీ ఆయనే చెబుతున్నారు. ఇదేమీ కోర్టుకు వెళ్లేంత పెద్ద సంగతి కాదని ఆయనే అన్నట్లుగా వార్తలు వచ్చాయి. నిజానికి మున్సిపాల్టీకి ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఆయన స్థలం కొలతలకు, ఇప్పుడు ఆయన తన హక్కులోకి తీసుకున్న స్ధలం కొలతలకు తేడా వుంది.

కోర్టులో ముందుగా ఏం జరిగినా, తరువాత క్లియర్ అయ్యేది అదే. ఎటొచ్చీ నోటీస్ ఇవ్వలేదు. అర్థరాత్రినో, తెల్లవారు ఝామునో హడావుడి చేసారు అనేదాని మీద కోర్టులో ఏమైనా ఆయనకు ఉపశమనం లభించవచ్చు కానీ స్థలం విషయంలో కాకపోవచ్చు. బహుశా అందుకే ఆయన ఆగిపోతున్నారేమో?

ఇలా తనకు తన స్థలం విషయంలో క్లారిటీ వుంది కాబట్టే, ఇక ఈ విషయాన్ని ఆ దారిలో కాకుండా కక్షసాధింపు దారిలోకి మళ్లించడానికే సబ్బం కాస్త గట్టిగానే వైకాపా అధినేతలపై విరుచుకుపడినట్లు కనిపిస్తోంది.

కానీ పాపం, విశాఖలో లోకల్ మీడియా ఒక్కటి కూడా సబ్బం విషయంలో అయ్యో అనడం లేదు. తప్పంతా ఆయనదే అన్నట్లుగా ఈవెనింగ్ డైలీలు అన్నీ రిపోర్ట్ చేసాయి. ఇవన్నీ చూస్తుంటే సబ్బం తిట్ల పై కాస్త ఆలోచించాల్సిందే.

బీసీలు ముద్దు..కాపులు వ‌ద్దు