Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సగం డబ్బు రెమ్యూనిరేషన్లకే!

సగం డబ్బు రెమ్యూనిరేషన్లకే!

ఒకపక్క నాన్ థియేటర్ ఆదాయం రావడం లేదని నిర్మాతలు ఆవేదన చెందుతున్నట్లు వార్తలు వినవస్తూనే వున్నాయి. ఇదే కారణం చాలా సినిమాలకు పాజ్ బటన్ నొక్కారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఓ సీనియర్ హీరోతో ఓ బడా నిర్మాణ సంస్థ ప్లాన్ చేసిన సినిమాకు సగానికి పైగా ఖర్చు రెమ్యూనిరేషన్లకే కేటాయించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఓ హిందీ రీమేక్ ను ఈ సంస్థ తలపెట్టింది. ఇందుకోసం హీరోకే 28 కోట్లు ఇవ్వాల్సి వస్తోందట. అదే సినిమాకు దర్శకుడికి 12 కోట్ల రెమ్యూనిరేషన్ అని టాక్ వినిపిస్తోంది.

ఇక్కడికే నలభై కోట్లు ఖర్చయిపోతే ఇక హీరోయిన్, మిగిలిన కాస్టింగ్, టెక్నకల్ టీమ్ అంతా కలిపి మరో పది కోట్లు అయినా ఖర్చు వుంటుంది. ఈ సినిమాను 85 కోట్ల బడ్జెట్ లో నిర్మించాలన్నది ప్లాన్ అంట. ఎందుకంటే హీరో థియేటర్, నాన్ థియేటర్ మార్కెట్ రీత్యా 80 కోట్లు దాటికే కష్టమే అవుతుంది. కాస్త రిస్క్ అనుకున్నా 90 కోట్ల వరకు వెళ్తారు.

అంటే రెమ్యూనిరేషన్లు పోగా ఇక బడ్జెట్ లో మిగిలేది నలభై కోట్లే. ఇందులోనే నిర్మాణ వ్యయం, వడ్డీలు అన్నీ. ఎంత తక్కువలో తీసినా ఈ బడ్జెట్ లో తీయడం అసాధ్యం అంటున్నారు. కానీ హీరో 28 కోట్లకు తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకోవడానికి సిద్దంగా లేరని తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమా బడ్జెట్ ఆన్ పేపర్ 85 కోట్లు అనుకున్నా 100 కోట్లు దాటేసే అవకాశం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?