బాహుబలి ప్రభాస్ సాహో సినిమాలో అత్యంత కీలమైనది దుబాయ్ లో తీసిన ఛేజింగ్. కోట్ల రూపాయల ఖర్చుతో తీసిన ఈ ఛేజింగ్ సీన్ గురించి ఇప్పటికే సినిమా జనాలకు, ప్రభాస్ అభిమానులకు అంతా తెలుసు. ఇప్పుడు ఈ సీన్ విషయంలోనే సాహో యూనిట్ ఫుల్ కేర్ తీసుకుంటోందని తెలుస్తోంది. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసి తీసిన సీన్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లు జోడించుకుని బయటకు వచ్చినపుడు ఎలా వుండాలి? ఆ కోట్ల ఖర్చు కచ్చితంగా కనిపించి, సాహో.. అనిపించాలి.
ట్రయిలర్ లో ఈ ఛేజ్ ను జస్ట్ అలా టచ్ చేసి వదిలారు. అందువల్ల పెద్దగా ఇంపాక్ట్ తెలియలేదు. కానీ సినిమాలో అలా కాదు. కొన్ని నిమిషాల పాటు వుంటుందీ సీన్. అందుకే ఈ టోటల్ ఛేజ్ కు సంబంధించి, విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో సాహో యూనిట్ చాలా కేర్ తీసుకుంటోందని తెలుస్తోంది.
అయితే మిగిలిన విఎఫ్ఎక్స్ పనులు చాలావరకు అయ్యాయి కానీ, ఈ ఛేజింగ్ వర్క్ మాత్రం ఇంకా కాస్త వుందని ఇండస్ట్రీ బోగట్టా. ఈ ఛేజింగ్ సీన్ కు వర్క్ ఏమాత్రం అప్ టు ది మార్క్ లేకపోతే మొత్తం వ్యవహారం తేడా వస్తుంది. అందుకే ఆ వర్క్ విషయంలో హడావుడి పెట్టకుండా, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.