సాయి ధరమ్ తేజ – వివి వినాయక్ కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
సినిమాలకు మాంచి టైటిల్స్ పెట్టడంలో మాంచి నేర్పు వున్న దర్శకుడు వినాయక్ ఈ సినిమాకు ఇంటిలిజెంట్ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. సి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సరైన హిట్ సినిమా పడక ఇబ్బందుల్లో వున్న సాయి దరమ్ బోలెడు ఆశలు పెట్టుకున్న సినిమ ఇది. సాయి ధరమ్ తేజ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోందీ సినిమాలో.
ఆకుల శివ అందించిన మాంచి కమర్షియల్ పొటన్షియాలిటీ వున్న కథను వివి వినాయక తన స్టయిల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంటిలిజెంట్ అనే టైటిల్ అయితే పక్కాగా వుంటుందని భావించి, ఈ టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.