డిమాండ్ వుంటే బేరం చేసే చాన్స్ వుండదు. ఇది మామూలు సరుకుల మార్కెట్ లో. డిమాండ్ లేకపోతే బేరం చేసే చాన్స్ వుండదు. ఇది హీరోల మార్కెట్ లో. హీరో సాయిధరమ్ తేజ పరిస్థితి ఇదే. వచ్చిన కథలు చేయాల్సిందే తప్ప, నచ్చిన కథల కోసం చూస్తూ కూర్చున్నా, వచ్చిన కథలు మార్చాలన్నా అంతగా సాధ్యంకాదు. తేజు అనేకాదు, డిమాండ్ లో లేని ఏ హీరో అయినా, వచ్చిన సబ్జెక్ట్ ను అదే బ్రహ్మాండం అనుకుని చేయాల్సిందే.
ఇదంతా ఎందుకంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ గ్యాసిప్ గురించే. లేటెస్ట్ గా సాయిధరమ్ తేజ్ చేస్తున్న మైత్రీ మూవీస్-కిషోర్ తిరుమల సినిమా కథ అంతగా కొత్తది కాదని వినిపిస్తోంది. ఈ సినిమా కథకు, ఆ మధ్య వచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ థేవ్ విజేత సినిమాకు చాలా సిమిలారిటీస్ వున్నాయని వినిపిస్తోంది.
వాస్తవానికి ధనుష్ రఘువరన్ బిటెక్ స్పూర్తితో ఈ రెండు కథలు తయారయ్యాయి. అందుకే కిషోర్ తిరుమల కథను హీరో నాని ఓకె చేయలేదు. దాంతో ఆ కథ సాయిధరమ్ దగ్గరకు వచ్చింది. కథ విన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఇది విజేత కథకు దగ్గరగా వుందని ఓపెన్ గానే చెప్పినట్లు బోగట్టా.
కానీ ఆ కథనే పెద్దగా మార్పులు చేయకుండానే తేజుతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి, కథ ఎలావున్నా, ట్రీట్ మెంట్ బాగుండి తేజు హిట్ కొడతాడేమో ఈసారి పక్కాగా.