సాయి ధరమ్ తేజ-వివి వినాయక్ కాంబినేషన్ లో ఓ సినిమా ముస్తాబవుతోంది. జవాన్ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ ఆశలన్నీ దీనిపైనే. ఈ సినిమాకు గతంలో ఇంటిలిజెంట్ అనే పేరు పెడుతున్నట్లు వార్తలు వినవచ్చాయి.
నిజానికి యూనిట్ ఆ దిశగానే ఆలోచనలు సాగించిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు మరో టైటిల్ కూడా ఆప్షనల్ డిస్కషన్స్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ధర్మాభాయ్ అనే టైటిల్ అయితే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటిలిజెంట్ అంటే కింద సెంటర్లకు, ఫ్యాన్స్ కు అంతగా నప్పదని, అంతకన్నా ధర్మాభాయ్ అంటే మాంచి మాస్ టైటిల్ గా వుంటుందని వినాయక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ కూడా ఈ టైటిల్ అంటే ‘మీరే టైటిల్ అంటే అదే’ అని వినాయక్ కే వదిలేసినట్లు తెలుస్తోంది. ఇంటిలిజెంట్ అంటే కాస్త డిఫరెంట్ గా వుంటుంది. కానీ మన ప్రేక్షకుల అభిరుచి ప్రకారం ధర్మాభాయ్ అంటే నేరుగా పాపులర్ అయిపోతుంది అని వినాయక్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.