టాలీవుడ్ ఇండస్ట్రీకి పేరే చిత్రపరిశ్రమ. ఇక్కడ చిత్రాలు జరుగుతుంటాయి. కొందరు ఎక్కడో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. మరెక్కడో సక్సెస్ అవుతుంటారు. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖులు సాయి కొర్రపాటి, దిల్ రాజులను చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఇద్దరూ డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చిన వారే. ఇద్దరూ సినిమా నిర్మాణాలు, అలాగే పంపిణీలు చేస్తున్నవారే.
కానీ ఇక్కడే ఒక చిత్రం కనిపిస్తోంది. దిల్ రాజుకు సినిమా నిర్మాణాలు కలిసి వస్తున్నాయి. తీసిన ప్రతి సినిమా దాదాపు హిట్టే. డబ్బులు తెచ్చి పెడుతున్నాయి. కానీ అదే సమయంలో పంపిణీకి తీసుకున్న సినిమాలు అన్నీ ఢమాల్ అంటున్నాయి. డబ్బులు పట్టుకుపోతున్నాయి. ఈ ఏడాదిలో విడుదలైన చాలా పెద్ద సినిమాలు దిల్ రాజే పంపిణీ చేసారు. అన్నీ ఢమాలే. అలాగే సాయి కొర్రపాటి వ్యవహారం రివర్స్ గా వుంది.
ఆయనకు నిర్మాణాలు సరిగ్గా కలిసిరావడం లేదు. ఆ మధ్య విడుదలైన జ్యో అచ్యుతానంద ఒక్కటే కాస్త కలిసి వచ్చింది. మిగిలినవన్నీ కథలు, డైరక్టర్ల పరంగా విఫలమే. పాపం, ఖర్చుకు వెనకాడడం లేదు. కానీ కొత్త డైరక్టర్లను గుడ్డిగా నమ్ముతున్నారు. అదే సమస్య.
కానీ అదే సమయంలో డిస్ట్రిబ్యూషన్లు కలిసివస్తున్నాయి. బాహుబలి వన్, టు రెండూ బాగానే కలిసి వచ్చాయి. కానీ అక్కడ వస్తున్న లాభాలు ఈ డైరక్టర్లు పట్టుకుపోతున్నారు. చిత్రమే కదా?