సాయి ధరమ్ తేజ ఇక కొత్తగా కనిపించనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తయారయ్యే సినిమా కోసం కొత్త హెయిర్ స్టయిల్ ను రూపొందించారు. ఇందుకోసం యూనిట్ రెండు లక్షల వరకు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. ముంబాయిలోని హెయిర్ స్టయిలిష్ స్పెషలిస్ట్ లు సాయి ధరమ్ కు నప్పే కొత్త హెయిర్ స్టయిల్ ను రూపొందించారు.
కాస్త తక్కువగా వుండే ఈ గెటప్ లో సాయి ధరమ్ చాలా హ్యాండ్ సమ్ గా వున్నాడు. ఇన్నాళ్లు సాయి ధరమ్ జుత్తు దాని ఇష్టం వచ్చినట్లు మొహం మీద పడుతూ వుండేది. ఇప్పుడు ఆ మోడల్ అంతా తీసేసి, పక్కా మాన్లీ లుక్ వచ్చేలా చేసారు. లూజ్ గా వుండే హెయిర్ ఇష్టం వచ్చినట్లు ఎగిరిపోకుండా, కొన్ని టెక్నిక్స్ వాడి మాంచి లుక్ వచ్చేలా చేసారట ముంబాయి హెయిర్ స్పెషలిస్ట్ లు.ఈలుక్ ను త్వరలో వదిలే సినిమా ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల మందుకు తెస్తారు.