సైరాకు సాహోనే సమస్య

సాహో… టాక్ ఆఫ్ ది టాలీవుడ్. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా. ఎంత భారీ సినిమా అనే దాని కన్నా ఎంత ప్రభావితం చూపించబోతోంది అన్నది కీలకం. ప్రఫంచ…

సాహో… టాక్ ఆఫ్ ది టాలీవుడ్. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా. ఎంత భారీ సినిమా అనే దాని కన్నా ఎంత ప్రభావితం చూపించబోతోంది అన్నది కీలకం. ప్రఫంచ వ్యాప్తంగా తొలిరోజు వందకోట్ల రూపాయల వసూలు టార్గెట్ గా వున్న సినిమా ఇది. ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమా దాదాపు మూడు నాలుగు తెలుగు సినిమాలను ప్రభావితం చేయబోతోంది. సాహో సినిమాకు కాస్త వెనుకగా వరుణ్ తేజ్ వాల్మీకి, నాని గ్యాంగ్ లీడర్ విడుదల కాబోతున్నాయి. అలాగే సాహో సినిమా వచ్చిన నెలరోజులకు మెగాస్టార్ సైరా వస్తోంది. ఈ మూడు సినిమాలకు సాహోతో సమస్యే. ఎలా?

సాహో బ్లాక్ బస్టర్ అయింది అనుకుందాం. అవడానికే ఎక్కువ చాన్స్ వుంది. ఎందుకంటే ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రయిలర్ ఆ సినిమా కంటెంట్ ను, క్వాలిటీని చెప్పకనే చెప్పాయి. ఆ సినిమా మేకింగ్ టాప్ లెవెల్లో వుందని కళ్లకు కట్టాయి. అందువల్ల రెండువారాల తరువాత విడుదలయ్యే వాల్మీకి, గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల కంటికి ఆనడం కష్టం. సాహో బ్లాక్ బస్టర్ అయితే ఆ రెండు సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కచ్చితంగా వస్తుంది.

వాల్మీకి, గ్యాంగ్ లీడర్ సినిమాల సంగతి అలావుంచితే నెలరోజులు వెనుకగా వచ్చే సైరాకు కష్టమే. సాహో బ్లాక్ బస్టర్ అయితే, కచ్చితంగా అన్ని విధాలా సైరా విషయంలో కంపారిజన్ వస్తుంది. క్వాలిటీ విషయంలో జనం పోల్చిచూడడం కామన్. జోనర్ వేరయినా, వర్క్ విషయంలో ఇది తప్పదు. ఏమాత్రం తేడావున్నా సైరాకు కష్టం అవుతుంది. అలాగే బ్లాక్ బస్టర్ అయితే సినిమా నాలుగు వారాలు కనీసం థియేటర్లలో వుంటుంది. అంటే సైరాకు థియేటర్లు పూర్తిస్థాయిలో లభించడం కష్టం అవుతుంది.

బై మిస్టేక్, సాహో సినిమా ఆశించిన ఫలితం సాధించలేకపోతే… అప్పుడు కూడా కష్టమే. ఎలా? సాహో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 100 కోట్ల మేరకు అడ్వాన్స్ ల రూపంలో అందించాల్సి వుంటుంది. ఈ మేరకు ఇప్పటికే అగ్రిమెంట్లు, ఇతరత్రా వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇచ్చిన అడ్వాన్స్ లు అన్నీ సెటిల్ కావాలి అంటే కనీసం అయిదారువారాలు పడుతుంది. సినిమా హిట్ అయితే కలెక్షన్ల రూపంలో వెనక్కు వచ్చేస్తాయి కానీ, అదృష్టం బాగాలేక తేడా వస్తే మాత్రం అంత సులువుగా వెనక్కు రావు.

అలాంటి నేపథ్యంలో సైరా సినిమాకు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బులు కట్టాలి అంటే అంత సులువుకాదు. ఎందుకంటే టాలీవుడ్ లో వంద కోట్ల మొత్తం సాహో మీద వుంటుంది. అందువల్ల టాలీవుడ్ లో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సినిమాలను సాహో విపరీతంగా ప్రభావితం చేయడం అన్నది మాత్రం పక్కా. సాహో సక్సెస్ అయినా కాకపోయినా కూడా.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..