'సైరా నరసింహారెడ్డి' టైటిల్ న్యూస్ లీక్ అయినపుడు 'ఉయ్యాలవాడ' అని కాకుండా ఇది పెడుతున్నారేంటని అనిపించింది. అయితే టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ చూసిన తర్వాత టైటిల్ చాలా బాగుందనే అభిప్రాయం కలిగింది. మోషన్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ అయింది. ఇంతవరకు బాగానే వుంది కానీ దీనికి పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడంలో మాత్రం విఫలమైంది.
అమితాబ్‌బచ్చన్‌తో పాటు ఇతర భాషలకి చెందిన ప్రముఖ నటులు, ఉద్ధండ సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ 'సైరా' గురించి తెలుగు వారు, చిరంజీవి అభిమానులకి మించి ఎవరూ ఎక్సయిట్ అయినట్టు కనిపించలేదు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించి మరో బాహుబలి స్కేల్ వున్న సినిమా వస్తుందనే భావన దేశవ్యాప్తంగా రేకెత్తించలేకపోయారు.
బాహుబలి సక్సెస్‌లో సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ కీలకం. సోషల్ మీడియాలో ఆ చిత్రాన్ని వైరల్ టాపిక్ చేయడంలో బాహుబలి టీమ్ సక్సెస్ అయింది. ఆ కిటుకులు కనిపెట్టి, సైరాని అలా అందరూ ఎదురు చూసే ప్రాజెక్ట్‌లా హైలైట్ చేయాలి. అప్పుడే దేశ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని జనం పట్టించుకునేది. మరి ఈ దిశగా క్రేజ్ పెంచేందుకు చరణ్ ఎలాంటి ప్రణాళిక వేస్తాడనేది చూడాలి.