సైరా తో పోటీకి ‘మామ’ దూరం?

నిర్మాత సురేష్ బాబు పీపుల్స్ మీడియాతో కలిసి నిర్మిస్తున్న సినిమా వెంకీమామ. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ముందుగా అనుకున్న డేట్ ఒకటి వుంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకున్నా అక్టోబర్…

నిర్మాత సురేష్ బాబు పీపుల్స్ మీడియాతో కలిసి నిర్మిస్తున్న సినిమా వెంకీమామ. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ముందుగా అనుకున్న డేట్ ఒకటి వుంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకున్నా అక్టోబర్ 4 అన్నది ఆ డేట్. అయితే ఎప్పుడయితే సైరా టీజిర్ బయటకు వచ్చిందో, మొత్తం మారిపోయినట్లు కనిపిస్తోంది.. ఆ సినిమా మీద పోటీ పడడమా? అన్న ఆలోచన వచ్చినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది.

వెంకీమామ సినిమా ముందుగా అనుకున్నట్లు అక్టోబర్ 4న వేస్తారా? వేయరా? అన్నది అనుమానం. వాస్తవాలు ఏమిటో అన్నది ఎలా వున్నా, వెంకటేష్ హెల్త్ కారణంగా రావడం లేదన్నది యూనిట్ వర్గాల బోగట్టా. వెంకటేష్ పాదం మెలితిరగడం వల్ల మొత్తం షెడ్యూలు వెనకబడిపోయిందని తెలుస్తోంది

రెండు వారాల టాకీ, ఓ సాంగ్, హెలికాప్టర్ షాట్ లు, ఇవన్నీ కాక వెంకటేష్ గెడ్డంతో చేయాల్సిన సీన్లు అన్నీ పెండింగ్ పడ్డాయి. అంటే గెడ్డం పెరగడానికే రెండు వారాలు పట్టే అవకాశం వుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో దసరాకు వచ్చే అవకాశమే లేదు. అందువల్ల ఆప్షనల్ డేట్ లు రెండే. 

అక్టోబర్ 25 లేదా డిసెంబర్ 20 రెండు డేట్ లు వున్నాయి. డిసెంబర్ 20కి నాలుగు సినిమాలు ముందుగా డేట్ ప్రకటించి వున్నాయి కాబట్టి, ఈ సినిమాను అప్పటికప్పుడు మీద వేస్తే గోల వుంటుంది. అందువల్ల అక్టోబర్ 25 కే వేసుకోవాల్సి వుంటుంది. 

కానీ సురేష్ బాబు వ్యవహారం ఇంకా వుంటుంది. ఆయన సినిమా చూడాలి. ఆయన సర్కిల్ లోని డైరక్టర్లకు, రైటర్లకు చూపించాలి. వాళ్ల ఒపీనియన్ల ప్రకారం రిపేర్లు వుంటాయి. ఓ బేబీకి ఇవన్నీ జరిగాయి. అటు వారం ఇటు వారం మరే సినిమా వుండకుండా చూడాలి. అప్పుడు డేట్ ఫిక్స్ అవుతుంది. 

ఈ లెక్కన చూసుకుంటే దీపావళి కి కూడా వెంకీమామ సినిమా డౌట్ అనే అనుకోవాలి. సురేష్ బాబు పూనుకుని, పక్కాగా అదే డేట్ కు రావాలి అనుకుంటేనే తప్ప, లేకపోతే సాధ్యం కాదు.