మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి రోజూ పండగే సక్సెస్ తరువాత సోలో బతుకే సో బెటరు సినిమా చేస్తున్నారు. ఇది విడుదలకు రెడీ అవుతుండగా మరో సినిమాను గురువారం ప్రారంభిస్తున్నారు.
ప్రస్థానం సినిమాతో తనదైన ముద్రను చూపించిన దర్శకుడు దేవా కట్టా మరోసారి మాంచి ఎమోషనల్ పొలిటికల్ స్టోరీని తెరపైకి తేవాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును భగవాన్ పుల్లారావు జేబి మూవీస్ పతాకంపై నిర్మిస్తారు.
ప్రస్థానం తరువాత సరైన సినిమా రాలేదు దేవా కట్టా నుంచి, అదే సినిమాను హిందీలో రీమేక్ చేసారు. ప్రశంసలు దక్కాయి కానీ, ఫలితం రాలేదు. ఇప్పుడు ఓ మాంచి స్క్రిప్ఠ్ తో తెలుగులో మరోసారి తన అదృష్టం, ప్రతిభను పరీక్షించుకోబోతున్నారు.
సాయి ధరమ్ తేజ్ ఎప్పుడో ఎర్లీ డేస్ లో ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు భగవాన్ పుల్లారావు లకు ఈ సినిమా చేస్తున్నారు.