దర్శకుడు గుణశేఖర్ తెలివైన వారు. రుద్రమదేవి టైమ్ లో బన్నీని తీసుకుని ఆ సినిమాకు బజ్ తెచ్చుకున్నారు. ఈసారి శకుంతల కోసం బన్నీ కూతురు అర్హను తీసుకుని తెలివైన ఎత్తు వేసారు.
శకుంతల సినిమాకు సమంత హీరోయిన్ అయినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ బన్నీ మాత్రం తన కూతురు కోసం చేస్తున్న హడావుడి ఇంతా అంతా కాదు. అదంతా శకుంతల సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోంది.
బన్నీ కూతురు మేకప్ చేసుకోవడం, బన్నీ కేరవాన్ నే కూతురు కూడా వాడడం, లోకేషన్ కు బన్నీ సతీసమేతంగా వెళ్లి మోనిటర్ దగ్గర కూర్చుని వీక్షించడం ఇవన్నీ ఆ సినిమాకు పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి. పైగా ఇవన్నీ చేసి బన్నీ ఊరుకోవడం లేదు. ఆ ఫొటోలు, ఆ ముచ్చటలు అన్నీ బన్నీ పీఆర్ టీమ్ యధాశక్తి సర్క్యులేట్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్టయిలిష్ స్టార్ బన్నీకి కనిపించని పోటీ వుందని ఫ్యాన్స్ వార్ చెబుతుంటుంది. ఇప్పటి వరకు స్టార్ కిడ్ గా మహేష్ కూతురు సితార మాత్రమే సోషల్ మీడియాలో పాపులర్. ఇప్పుడు అర్హ కూడా రంగంలోకి దిగినట్లు అయింది.
ఎ ఎమ్ బి మాల్ అంటూ మహేష్ కట్టగానే అదే ఆసియన్ సినిమాస్ తో బన్నీ కూడా జతకట్టి ఎ ఎ ఎ మాల్ ను అమీర్ పేటలో నిర్మిస్తున్నారు. మొత్తం మీద ఏమైతేనేం గుణశేఖర్ శకుంతల సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతోంది. హ్యాపీ.