వేరే వాళ్లు సాగిస్తే ప్రేమాయణం, డేటింగ్, లివింగ్ రిలేషన్షిప్.. ఇలా వేర్వేరు పేర్లు పెట్టుకోవచ్చు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ది మాత్రం ప్రత్యేక ధోరణి. సల్మాన్ డైరీలో ఎక్కడా ఈ మాటలు వినపడవు. అయితే పలువురు హీరోయిన్లతో మాత్రం అతడి పేరు ముడిపడుతూ ఉంది. ఒక్క ఐశ్వర్యరాయ్ తో తప్ప సల్మాన్ ప్రేమాయణాన్ని నడిపినట్టుగా దాఖలాలు కనపడవు. కానీ సల్మాన్ ప్రోత్సహించింది మాత్రం చాలా మంది హీరోయిన్లను!
వీరిలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కత్రినాకైఫ్, వీర్ హీరోయిన్ జరీనాఖాన్.. వంటి వారే ప్రముఖంగా వినిపించాయి వివిధ కాలాల్లో. వీరికి ముందు ఐశ్వర్యరాయ్, దానికి ముందు సంగీతా బిజ్లానీ.. వంటి వాళ్లు జాబితాలో ఉంటారు. ప్రత్యేకించి భాయ్ టేస్టులో హాఫ్ ఇండియన్స్, విదేశీ భామలుంటారు. కత్రినాకైఫ్ హాఫ్ ఇండియన్ కాగా, జాక్వెలిన్ అంతర్జాతీయ అందాల పోటీల్లో నెగ్గిన విదేశీ భామ.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన మరో పేరు వినిపిస్తూ ఉంది. సమంతా లాక్ వుడ్ అని అమెరికన్ భామ. వయసు దాదాపు నలభై. గ్లామర్ ఫీల్డ్ కు సంబంధించిన వ్యక్తే. ఇటీవల సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈమె అతడికి కంపెనీ ఇచ్చిందని, చాలా సన్నిహితురాలు అని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది.
వీరిద్దరి సాన్నిహిత్యం గత కొన్నాళ్లుగా సాగుతోందని సమాచారం. ఇది సల్మాన్ ఖాన్ కొత్త రొమాంటిక్ స్టోరీ అని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే సమంత మాత్రం.. అదేం లేదని, తాము జస్ట్ తెలిసిన వారం అని చెబుతోంది. అయితే యాభై ఆరేళ్ల వయసులో సల్మాన్ కొత్త కథను నడిపిస్తున్నాడనేది మాత్రం టాక్ ఆఫ్ ద టౌన్!